
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. దీనికోసం దేశంలో ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బడ్జెట్ లో లభించే రాయితీలు, మినహాయింపులు, ప్రోత్సాహకాలపై లెక్కలు వేసుకుంటున్నారు. బీమా రంగ నిపుణులు కూడా బడ్జెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. బీమా రంగానికి ఇచ్చే రాయితీల కోసం ఎదురు చూస్తున్నారు.
జీవిత బీమాపై జీఎస్టీ తగ్గించడం, ఆరోగ్య పథకాలపై పన్ను మినహాయింపు కోసం బీమా రంగ నిపుణులు ఎదురు చూస్తున్నారు. దీనివల్ల దేశంలో బీమా రంగం మరింత ముందుకు వెళ్లడంతో పాటు ప్రజలకు ఆరోగ్య సంరక్షణ లభిస్తుందని చెబుతున్నారు. బీమా ఉత్పత్తులను మరింత ఆకర్షణీయంగా, విస్తృతంగా ప్రజలకు అందుబాటులోకి వస్తాయని, అనేక ప్రయోజనాలు కలుగుతాయని వివరిస్తున్నారు.
దేశంలో బీమా రంగం ఇటీవల క్రమంగా ముందుకు సాగుతోంది. ఆరోగ్యంపై ప్రజలు అనేక జాగ్రత్తలు తీసుకోవడం వల్ల బీమా పాలసీలకు ఆదరణ కూడా పెరిగింది. గతంలో పట్టణాలు, నగర వాసులకే వీటిపై అవగాహన ఉండేది. ఇప్పుడు గ్రామీణులు సైతం పాలసీలు కడుతున్నారు. కేంద్ర బడ్జెట్లో బీమా రంగానికి ప్రోత్సాహకాలు పెంచితే మరింత ఊతం లభిస్తుందని ఆ రంగ నిపుణులు భావిస్తున్నారు.
కేంద్ర బడ్జెట్ లో తాము ఆశిస్తున్న ప్రయోజనాలను దేశంలోని ప్రముఖ బీమా సంస్థల నిపుణులు తెలిపారు. ఆరోగ్య బీమాకు జీఎస్టీ తగ్గించడం వారి ప్రధాన అంచనాలలో ఒకటి. అలాగే ప్రజలు, వారిపై ఆధారపడిన వారికి, సీనియర్ సిటిజన్లలైన తల్లిదండ్రులకు చెల్లించే ఆరోగ్య బీమా ప్రీమియాల కోసం సెక్షన్ 80డీ కింద మినహాయింపు పరిమితి పెరుగుదల ఆశిస్తున్నారు.
యూనియన్ బడ్జెట్ లో రిస్క్ మేనేజ్‌మెంట్, రక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను ప్రోత్సహించే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం ఈ క్రింది చర్యలను పరిగణించాలని కోరుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..