EV Scooters: మార్కెట్‌కు ఈవీ కిక్.. త్వరలో విడుదలకానున్న బెస్ట్ టూ వీలర్స్ ఇవే

దేశ మార్కెట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా కొనసాగుతోంది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అన్ని చోట్లా ఇవి పరుగులు తీస్తున్నాయి. కొత్త గా ద్విచక్ర వాహనం కొనుగోలు చేయాలనుకునే వారితో పాటు పాత వాహనాన్ని మార్చాలనుకునే వారు కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో అనేక బ్రాండ్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అందుబాటులో ఉన్నాయి.

EV Scooters: మార్కెట్‌కు ఈవీ కిక్.. త్వరలో విడుదలకానున్న బెస్ట్ టూ వీలర్స్ ఇవే
Ev Scooters

Updated on: Jul 02, 2025 | 3:45 PM

భారతదేశంలో అందుబాటులో ఉన్న ఉన్న ఈవీ స్కూటర్లు స్టైల్, కంఫర్ట్, మన్నిక, రేంజ్ విషయంలో ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. మీరు కూడా ఎలక్ట్రిక్ వాహనం తీసుకోవాలనుకుంటే ఇదే మంచి అవకాశం. అలాగే మరికొన్ని స్కూటర్లు కూడా ఈ ఏడాది చివరిలో, వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా మార్కెట్ లోకి రానున్న స్కూటర్ల వివరాలు, ధరను తెలుసుకుందాం.

గోగోరో 2 సిరీస్

గోగోరో 2 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను 2026 మార్చిలో విడుదల చేయనున్నారు. దీని ధర సుమారు రూ.1.50 లక్షల వరకూ ఉండవచ్చని భావిస్తున్నారు. సుమారు 170 కిలోమీటర్ రేంజ్ వస్తుంది. దీనిలోని లిథియం – అయాన్ బ్యాటరీని ఇంట్లో చార్జింగ్ చేసుకోనవసరం లేదు. స్వాపింగ్ స్టేషన్ కు వెళ్లి క్షణాల్లో మార్పు కోవచ్చు. సుమారు 122 కిలోల బరువుంటే ఈ స్కూటర్.. టెక్నాలజీని ఇష్టపడే వారికి బాగా నప్పుతుంది. ముఖ్యంగా నగరంలో ప్రయాణానికి అనువుగా ఉంటుంది.

సుజుకీ బర్గ్ మాన్ ఎలక్ట్రిక్

సుజుకీ నుంచి బర్గ్ మాన్ పేరుతో పెట్రోల్ వెర్షన్ వెహికల్ గతంలోనే విడుదలైంది. ఆ వెర్షన్ ను ఇప్పుడు ఎలక్ట్రిక్ విభాగంలో తీసుకువస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో ఈ స్కూటర్ విడుదలవుతుందని అంచనా. దీనిలో 4 కేడబ్ల్యూ బ్యాటరీ ఏర్పాటు చేశారు. సింగిల్ చార్జిపై సుమారు 90 కిలోమీటర్లు పరుగులు తీస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.20 లక్షల వరకూ ఉండవచ్చు.

ఇవి కూడా చదవండి

వెస్పా ఎలక్ట్రిక్ స్కూటర్

ఆధునిక ఫీచర్లు, లేటెస్ట్ టెక్నాలజీతో రూపొందిస్తున్న వెస్పా ఎలక్ట్రిక్ స్కూటర్ 2026 మార్చిలో మార్కెట్ లోకి విడుదల కానుంది. స్టైల్ తో పాటు సౌకర్యం కోరుకునే వారికి చాలా బాగుంటుంది. కేవలం 3.5 గంటల్లో బ్యాటరీని పూర్తిస్థాయిలో చార్జింగ్ చేసుకోవచ్చు. సుమారు వంద కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. గంటకు గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయవచ్చు. దీని ధర రూ.1.70 లక్షల వరకూ ఉంటుందని అంచనా.

విడా వీఎక్స్2

అత్యంత తక్కువ ధరకే లభిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో విడా వీఎక్స్2 ఒకటి. కేవలం రూ.70 వేల కంటే తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనిలో వీఎక్స్2 గో, వీఎక్స్2 ప్లస్, వీఎక్స్2 ప్రో అనే వేరియంట్లు ఉన్నాయి. వేరియంట్ల వారీగా బ్యాటరీ సామర్థ్యం మారుతూ ఉంటుంది. కాంపాక్ట్ డిజిటల్, భౌతిక కీ ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటర్ ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉంది.

గోగోరో క్రాస్ ఓవర్

గోగోరో క్రాస్ ఓవర్ స్కూటర్ ఈ ఏడాది డిసెంబర్ లో విడుల అవుతుందని మార్కెట్ నిపుణుల అంచనా. దీని ధర రూ.1.20 లక్షల వరకూ ఉండొచ్చని భావిస్తున్నారు. పూర్తిస్థాయి సింగిల్ చార్జిపై సుమారు 111 కిలోమీటర్ల వరకూ ప్రయాణం చేయవచ్చు. గంటకు గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. విద్యార్థులు, ఉద్యోగస్తులకు చక్కగా సరిపోతుంది. అన్ని రకాల రోడ్లపై ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి