Union Budget 2026: సామాన్యులకు కేంద్రం గుడ్‌న్యూస్..! బడ్జెట్‌లో రెండు భారీ శుభవార్తలు.. తగ్గనున్న ఖర్చులు..!

2026-27 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం త్వరలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఫిబ్రవరి 1న విడుదల చేయనున్న బడ్జెట్‌లో దేశ ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయాలు ఏం ఉంటాయనేది హాట్‌టాపిక్‌గా మారింది. ఇన్‌కమ్ ట్యాక్స్, జీఎస్టీ శ్లాబుల్లో మార్పుల కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

Union Budget 2026: సామాన్యులకు కేంద్రం గుడ్‌న్యూస్..! బడ్జెట్‌లో రెండు భారీ శుభవార్తలు.. తగ్గనున్న ఖర్చులు..!
Union Budget 2026 27

Updated on: Jan 18, 2026 | 9:22 AM

కేంద్ర బడ్జెట్‌కు రంగం సిద్దమైంది. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే బడ్జెట్ రూపకల్పన వడివడిగా జరుగుతోంది. అయితే ఈ సారి బడ్జెట్‌ ఎలా ఉంటుందనే దానిపై సామాన్య, మధ్యతరగతి ప్రజలతో పాటు వ్యాపార వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎలాంటి ఉపశమనాలు ఉంటాయనే దానిపై చర్చోపచర్చలు నడుస్తున్నాయి. ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయింపులు, శ్లాబుల మార్పుతో పాటు కొత్త పథకాల అమలు కోసం సామాన్య ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇక జీఎస్టీలో ఏమైనా మార్పులు చోటుచేసుకుంటాయా? అనేది కూడా చూస్తున్నారు. 2026 బడ్జెట్‌లో ఆదాయపు పన్ను, జీఎస్టీలో సామాన్యులకు ఉపయోగపడేలా పలు మార్పులు జరగనున్నాయని తెలుస్తోంది.

ఆదాయపు పన్ను పరిమితి పెంపు

ప్రస్తుతం రూ.12 లక్షల్లోపు ఆదాయానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 2026 బడ్జెట్‌లో ఆ లిమిట్‌ను మరింత పెంచనున్నారని తెలుస్తోంది. దీని వల్ల జీతం పొందేవారితో పాటు మధ్యతరగతి ప్రజలకు లాభం జరగనుంది. మాధ్యతరగతి ప్రజల దగ్గర మరిన్ని డబ్బులు చేతుల్లో ఉండే అవకాశముంది. దీని వల్ల కొనుగోళ్లు పెరిగి దేశ ఆర్ధిక వ్యవస్థకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

జీఎస్టీ మినహాయింపులు

ఇక ఆదాయపు పన్ను పరిమితిలో మార్పులతో పాటు జీఎస్టీలో పలు మినహాయింపులు ఇచ్చే అవకాశముంది. ప్రజల రోజువారీ ఖర్చులపై భారం తగ్గించేలా పలు వస్తువుల జీఎస్టీ రేట్లను తగ్గించే అవకాశముందని సమాచారం. దీని వల్ల ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడటమే కాకుండా మధ్యతరగతి ప్రజలకు పెరిగిన ధరల నుంచి ఊరట లభించినట్లవుతుంది.

రైల్వేలకు ప్రాధాన్యత

ఇక ఈ సారి బడ్జెట్‌లో రైల్వే నెట్‌వర్క్ అభివృద్దికి మరింత ప్రాధాన్యత ఇవ్వనున్నారని తెలుస్తోంది. కొత్త రైల్వే ట్రాక్‌లు, ట్రాక్‌లను విస్తరించడం, రైల్వే సామర్థ్యాన్ని పెంచడం, కొత్త రైళ్లు ప్రవేశపెట్టడం, రైల్వే మౌలిక సదుపాయాలు పెంచడానికి బడ్జెట్‌లో ఎక్కువ కేటాయింపులు జరపనున్నారని వార్తలు వస్తున్నాయి. దీని వల్ల రవాణా సౌకర్యాలు మెరుగవ్వడం ద్వారా సామాన్య ప్రజలకు ఉపయోగం జరగడమే కాకుండా కొత్త పెట్టుబడులు వచ్చి ఉపాధి పెరగనుంది.

MSME రంగానికి ప్రోత్సాహకాలు

ఇక స్టార్టప్, MSME కంపెనీలకు ప్రోత్సాహకలు పెంచేలా బడ్జెట్‌లో నిర్ణయాలు ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు.  చిన్న కంపెనీలకు బ్యాంకు రుణాలు తక్కువ వడ్డీకే ఇవ్వడం, సులభతరంగా ఉండేలా నిబంధనలు మార్చడం లాంటివి ఉంటాయని చెబుతున్నారు. దీని వల్ల కంపెనీలు లాభపడటం వల్ల యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.