ప్రస్తుతం మారుతీ సుజికీ బాలెనోపై ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఈ కారు 2015లో విడుదలైంది. అప్పటి నుంచి విక్రయాల్లో దూసుకుపోతోంది. దీనిలోని 1.2 లీటర్ పెట్రోలు ఇంజిన్ నుంచి 88 బీహెచ్ పీ, 113 ఎన్ఎం టార్క్ విడుదల అవుతుంది. సుమారు 23 నుంచి 31 కిలోమీటర్ల మధ్య మైలేజీ వస్తుంది. దీనిలో సీఎన్ జీ వేరియంట్ కూడా విడుదలైంది. ఈ కారు రూ.6.66 లక్షల నుంచి రూ.9.83 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య అందుబాటులో ఉంది. అయితే బాలెనో కు ప్రత్యామ్నాయంగా మార్కెట్ లో అందుబాటులో ఉన్న కార్లు ఇవే.
టయోటా గ్లాంజాలో 1.2 లీటర్ పెట్రోలు, నాలుగు సిలింజర్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. దాని నుంచి 88 బీహెచ్ పీ, 113 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి అవుతుంది. దీని ధర రూ.6.86 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ ఉంది. బాలెనోతో పోల్చితే కొన్ని చిన్న తేడాలున్నాయి. గ్లాంజాలో ప్రత్యేకంగా ఫ్రంట్ బంపర్, ఎల్ఈడీ లైట్లు, కొత్త అల్లాయ్ వీల్స్, స్పెషల్ టెయిల్ లైట్లు అమర్చారు. ఈ కారుకు మూడేళ్ల లేదా లక్ష కిలోమీటర్ల వరకూ వారంటీ ఉంది. దాన్ని పంచవర్ష ప్రణాళిక ద్వారా 2.20 లక్షల కిలోమీటర్లకు అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. కానీ బాలెనో వారంటీ రెండేళ్లు లేదా 40 వేల కిలోమీటర్లకు పరిమితమైంది.
బాలెనోకి మరో ప్రత్యామ్నాయంగా స్విఫ్ట్ ను పరిగణించాలి. మంచి స్లైల్, కొత్త ఫీచర్లు, సరికొత్త ఇంజిన్ తో మారుతీ స్విఫ్ట్ మార్కెట్ లోకి వచ్చింది. ప్రస్తుతం స్విఫ్ట్ జెడ్ సిరీస్ 1.2 లీటర్ మూడు సిలిండర్ ఇంజిన్ తో అందుబాటులో ఉంది. దాని నుంచి 80.46 బీహెచ్ పీ, 111.7 ఎన్ఎం టార్క్ విడుదల అవుతుంది. ఐదు స్పీడ్ మాన్యువల్ లేదా ఐదు స్పీడ్ ఏటీఎం ఎంపికలు, గేర్ షిప్టుల కోసం హైడ్రాలిక్ క్లబ్ లు ఏర్పాటు చేశారు. ఆరు ఎయిర్ బ్యాగులు, ఎలక్టానిక్ స్టెబిలీటీ ప్రోగ్రామ్ (ఈఎస్పీ),ఏటీస్ తదితర ఫీచర్లతో భద్రతకు ఢోకా లేదు. హిల్ హూస్ట్ అసిస్ట్, బ్రేక్ అసిస్ట్ తదితర ప్రత్యేకతలు ఆకట్టుకుంటున్నాయి. మారుతీ సుజుకీ స్విఫ్ట్ ధర రూ.6.49 లక్షల నుంచి రూ.9.60 లక్షల మధ్య ఉంది.
టాటా ఆల్ట్రోజ్ కారు మూడు రకాల ఇంజిన్ ఎంపికలతో అందుబాటులోకి వచ్చింది. 1.2 లీటర్ పెట్రోలు, 1.2 లీటర్ టర్బో పెట్రోలు, 1.5 లీటర్ డిజిన్ ఇంజిన్లలో నచ్చిన దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఈ కారు రూ.6.50 లక్షల నుంచి 10.85 లక్షల మధ్య అందుబాటులో ఉంది. టాటా ఇటీవలే ఆల్ట్రోజ్ రేసర్ ను పరిచయం చేసింది. ఈ కారు ఇంజిన్ 118 బీహెచ్ పీ , 172 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్పోర్టియర్ వేరియంట్ ప్రత్యేక స్లైలిష్ లుక్ తో ఆకట్టుకుంటోంది.
హ్యుందాయ్ ఐ20 కారు వివిధ రకాల వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 1.2 లీటర్ పెట్రోలు, 1.0 లీటర్ టర్బో పెట్రోలు ఇంజిన్ ఎంపికలలో లభిస్తుంది. 1.2 లీటర్ పెట్రోలు ఇంజిన్ 82 బీహెచ్పీ, 115 ఎన్ఎం టార్కును విడుదల చేస్తుంది. ఐదు స్పీడ్ మాన్యువల్ లేదా ఐవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ను జత చేశారు. ఈ కారు ధర రూ.7.04 లక్షల నుంచి రూ.11.21 లక్షల మధ్య పలుకుతుంది. అలాగే హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ కూడా మార్కెట్ లోకి విడుదలైంది. ఈ కారు రూ.9.99 లక్షల నుంచి రూ.12.52 లక్షల మధ్య అందుబాటులో ఉంది. స్లైలిష్ ఎలిమెంట్స్, స్పోర్టియర్ డైవ్ కోసం స్పెషల్ సస్పెన్షన్, 1.0 లీటర్ టర్బో పెట్రోలు ఇంజిన్, ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్, ఈఎస్సీ తదితర ప్రత్యేకతలున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి