SBI FASTag: టోల్ గేట్ల వద్ద ఆ మోసాలకు చెక్.. ఎస్‌బీఐ కొత్త డిజైన్ ఇదే..

|

Sep 06, 2024 | 6:54 PM

కొందరు తమ పెద్ద వాహనాలకు చిన్న వాహనాల స్టిక్లర్ అతికించుకుని రాకపోకలు సాగిస్తున్నారు. దీనివల్ల వారికి టోల్ తక్కువ కట్ అవుతోంది. ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. ఈ సమస్య పరిష్కారానికి ఎస్ బీఐ తన ఫాస్ట్ ట్యాగ్ విధానంలో కొత్త మార్పులు తీసుకువచ్చింది. వాటి గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

SBI FASTag: టోల్ గేట్ల వద్ద ఆ మోసాలకు చెక్.. ఎస్‌బీఐ కొత్త డిజైన్ ఇదే..
Fastag
Follow us on

జాతీయ రహదారులపై ప్రయాణం చేసేటప్పడు టోల్ గేట్లు కనిపిస్తాయి. అక్కడ వాహనాలను నుంచి టోల్ (పన్ను) వసూలు చేస్తుంటారు. వివిధ వాహనాల డైవర్లు అక్కడ సిబ్బందికి డబ్బులు చెల్లిస్తూ ఉంటారు. సాధారణంగా జాతీయ రహదారులపై వేలకొలదీ వాహనాలు పరుగులు తీస్తుంటాయి. వీటిని టోల్ గేట్ల దగ్గర ఆపి డబ్బులు చెల్లించడం వల్ల సమయం పడుతుంది. అలాగే వెనుక నిలిచిన వాహనాలతో ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్యాగ్ విధానం తీసుకువచ్చింది. దీని ద్వారా వాహనం టోల్ గేట్ మీదుగా వెళ్లినప్పుడు మీరు లింక్ చేసిన ఖాతా నుంచి ఆటోమెటిక్ గా టోల్ చార్జీ కట్ అవుతుంది. కాగా.. ఈ ఫాస్ట్ ట్యాగ్ సేవలను ఖాతాదారులకు అందించడానికి దేశ వ్యాప్తంగా 22 బ్యాంకులకు అనుమతి ఉంది. వాటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) కూడా ఒకటి.

ఫాస్ట్ ట్యాగ్ అంటే..

ఫాస్ట్ ట్యాగ్ విధానంలో భాగంగా వాహనాల డోర్లపై స్టిక్లర్ అతికిస్తారు. ఆర్ఎఫ్ఐడీ టెక్నాలజీతో పనిచేసే ఆ స్టిక్కర్ ఉన్న వాహనం టోల్ గేట్ మీదుగా వెళ్లినప్పుడు యజమాని ఖాతా నుంచి టోల్ చార్జీ ఆటోెమెటిక్ గా కట్ అవుతుంది. అయితే కొందరు తమ పెద్ద వాహనాలకు చిన్న వాహనాల స్టిక్లర్ అతికించుకుని రాకపోకలు సాగిస్తున్నారు. దీనివల్ల వారికి టోల్ తక్కువ కట్ అవుతోంది. ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. ఈ సమస్య పరిష్కారానికి ఎస్ బీఐ తన ఫాస్ట్ ట్యాగ్ విధానంలో కొత్త మార్పులు తీసుకువచ్చింది.

ఎస్ 4 వాహనాల కోసం..

ఎస్ బీఐ పరిచయం చేసిన కొత్త ఫాస్ట్ ట్యాగ్ డిజైన్ తో టోల్ వెయిట్ టైమ్‌లను తగ్గించడంతో పాటు వాహనాల వ్యత్యాసాలను గుర్తించడానికి మరింత ఉపయోగపడతుంది. వెహికల్ క్లాస్ (వీసీ-04) విభాగంలో ఎస్ బీఐ ఫాస్ట్‌ట్యాగ్ కోసం కొత్త డిజైన్‌ను ప్రవేశపెట్టింది. చిన్న వాహనాలకు సంబంధించిన ఫాస్ట్ ట్యాగ్ లను కొందరు పెద్ద వాహనాలకు అతికించి టోల్ గేట్లు మీదుగా వెళ్లిపోతున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయానికి నష్టం కలుగుతుంది. దీంతో ఎస్ బీఐ చిన్న వాహనాల (ఎస్ 4) కోసం ప్రత్యేకంగా ఫాస్ట్ ట్యాగ్ ను డిజైన్ చేసింది.

ఆర్ఎఫ్ఐడీ టెక్నాలజీ..

ఎస్ బీఐ ఫాస్ట్ ట్యాగ్ అనేది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) టెక్నాలజీతో పనిచేసే సాధనం. లింక్ చేసిన ప్రీపెయిడ్, సేవింగ్స్ ఖాతా నుంచి నేరుగా టోల్ చెల్లింపులు జరుగుతాయి. దీన్ని వాహనం విండ్‌ స్క్రీన్‌పై అతికిస్తారు. జీపులు, కార్లు, వ్యాన్లు (క్లాస్ 4) తదితర వాహనాలకు ఎస్ బీఐ కొత్త ఫాస్ట్‌ట్యాగ్ డిజైన్ ఉపయోగపడుతుంది. వాహనం గుర్తింపును మెరుగుపరచడం, టోల్ వసూలు ప్రక్రియను వేగవంతం చేయడం, ప్రయాణ సమయాన్ని తగ్గిడం దీని ప్రధాన లక్ష్యాలు. కొత్త ట్యాగ్ ఆగస్ట్ 30వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చింది.

ప్రయోజనాలు..

  • టోల్ ప్లాజా ఆపరేటర్లు గేట్ వద్ద వాహనాలను సరిగ్గా గుర్తించేందుకు మెరుగైన డిజైన్ ఉపయోగపడుతుంది.
  • టోల్ చెల్లింపులు వేగంగా ప్రాసెస్ జరుగుతాయి. ప్రయాణం సమయం ఆలస్యం కాకుండా ఉంటుంది.
  • కొత్త ఫాస్ట్‌ట్యాగ్ విధానంలో టోల్ ఛార్జీల విధానం పారదర్శకంగా ఉంటుంది. పెద్ద వాహనాలకు చిన్నవాహనాల స్టిక్లర్లు అతికించుకుంటే వెంటనే గుర్తిస్తారు. దీనివల్ల ప్రభుత్వానికి, టోల్ రాయితీదారులకు ఉపయోగం కలుగుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..