Income Tax Exemption: ఆ ఆదాయానికి లెక్క చెప్పక్కర్లేదు… ఆదాయపు పన్ను వర్తించని ఆదాయాలేంటో తెలుసుకోండి

|

Jul 06, 2023 | 6:30 PM

పన్ను చెల్లింపులకు బాధ్యత వహించని ఆరు ఆదాయ వనరులను ఏంటో ఓ సారి తెలుసుకుందాం. ఈ మినహాయింపులు కొన్ని రంగాలకు ఆదాయపు పన్ను బాధ్యతల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఈ మినహాయింపులు నిర్దిష్ట ప్రమాణాలు, పరిమితులను కలిగి ఉన్నాయని గమనించడం ముఖ్యం.  

Income Tax Exemption: ఆ ఆదాయానికి లెక్క చెప్పక్కర్లేదు... ఆదాయపు పన్ను వర్తించని ఆదాయాలేంటో తెలుసుకోండి
Income Tax Filling
Follow us on

భారతదేశంలో ఆదాయపు పన్ను అనేది జీతాలు, వ్యాపారాలు, మూలధన లాభాలు, అద్దె వంటి వివిధ ఆదాయాలపై పన్నులు విధిస్తారు. అయితే కొన్ని రంగాలు ఆదాయపు పన్ను నుండి మినహాయింపులను పొందుతాయి. పన్ను చెల్లింపులకు బాధ్యత వహించని ఆరు ఆదాయ వనరులను ఏంటో ఓ సారి తెలుసుకుందాం. ఈ మినహాయింపులు కొన్ని రంగాలకు ఆదాయపు పన్ను బాధ్యతల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఈ మినహాయింపులు నిర్దిష్ట ప్రమాణాలు, పరిమితులను కలిగి ఉన్నాయని గమనించడం ముఖ్యం.  

వ్యవసాయ ఆదాయం

వ్యవసాయ రంగానికి, రైతులకు మద్దతుగా, వ్యవసాయ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయానికి భారత ప్రభుత్వం పన్ను మినహాయింపును మంజూరు చేసింది. 1961 ఆదాయపు పన్ను చట్టం ప్రకారం వ్యవసాయ ఉత్పత్తి ద్వారా వచ్చే ఆదాయం, వ్యవసాయ భూమి నుండి వచ్చే అద్దె ఆదాయం, ధాన్యాలు, పప్పులు, సుగంధ ద్రవ్యాలు వంటి పంటల అమ్మకం, ప్రాసెసింగ్‌పై పన్ను మినహాయింపు ఉంది. ఈ మినహాయింపు వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు (హెచ్‌యూఎఫ్‌) ఇద్దరికీ వర్తిస్తుంది.

బహుమతులు

వివాహాలను జరుపుకోవడానికి బహుమతులు ఇచ్చినప్పుడు వాటికి పన్నుల నుంచి మినహాయింపు ఉంటుంది. అంటే దంపతులు ఆస్తి, డబ్బు, నగలు లేదా ఇతర విలువైన వస్తువుల రూపంలో పొందిన బహుమతులపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఆ బహుమతి బంధువు కాని వ్యక్తి నుంచి పొందితే రూ. 50,000 మినహాయింపు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

వడ్డీ ఆదాయం

కొన్ని రకాల వడ్డీ ఆదాయం పన్ను నుంచి మినహాయింపు వస్తుంది. ఇందులో బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ రూ. 10,00గా ఉంటుంది.  గోల్డ్ డిపాజిట్ బాండ్‌లపై వడ్డీ, స్థానిక అధికారులు జారీ చేసే వడ్డీ, పన్ను రహిత ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుండి వడ్డీపై ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

గ్రాట్యుటీ

వ్యక్తులు పొందే గ్రాట్యుటీ సాధారణంగా పన్ను రహితంగా ఉంటుంది. అయితే ఉపాధి రకాన్ని బట్టి పాలసీ మారవచ్చు. ప్రభుత్వోద్యోగులతో పోలిస్తే ప్రభుత్వేతర ఉద్యోగులు వేర్వేరు నియమాలను కలిగి ఉంటారు. అయితే సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు పొందే గ్రాట్యుటీకి పన్నుల నుంచి మినహాయింపు ఉంటుంది.

బీమా సొమ్ము

బీమా పాలసీల నుంచి వచ్చే డబ్బు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయంగా పరిగణించరు. ఇది హామీ మొత్తం మరియు అందుకున్న బోనస్‌లు రెండింటికీ వర్తిస్తుంది. అందువల్ల, బీమా చెల్లింపులను స్వీకరించే వ్యక్తులు తమ పన్ను విధించదగిన ఆదాయాల్లో భాగంగా ఈ మొత్తాన్ని చేర్చాల్సిన అవసరం లేదు.

పెన్షన్ నుంచి వచ్చే ఆదాయం

ఐక్యరాజ్యసమితి లేదా భారత సాయుధ దళాల నుంచి వచ్చే ఆదాయం కూడా పన్ను మినహాయింపుకు అర్హమైనది. అదనంగా భారత కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక అవార్డుల విజేతలు వారు పొందే పెన్షన్ మొత్తాలపై పన్నులు చెల్లించకుండా మినహాయింపునిచ్చారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి