Telecom Sector: 5G స్పెక్ట్రమ్‌ వేలంలోకి గౌతమ్‌ ఆదానీ.. ఇద్దరు పారిశ్రామిక వేత్తల మధ్య ఆసక్తికర పోటీ..!

|

Aug 01, 2022 | 3:42 PM

Telecom Sector: 5G స్పెక్ట్రమ్‌ను వేలం వేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ వేలం ప్రారంభానికి ముందు పలువురి పేర్లు బయటకు రావడంతో సందడి నెలకొంది. ముఖేష్ అంబానీ..

Telecom Sector: 5G స్పెక్ట్రమ్‌ వేలంలోకి గౌతమ్‌ ఆదానీ.. ఇద్దరు పారిశ్రామిక వేత్తల మధ్య ఆసక్తికర పోటీ..!
Follow us on

Telecom Sector: 5G స్పెక్ట్రమ్‌ను వేలం వేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ వేలం ప్రారంభానికి ముందు పలువురి పేర్లు బయటకు రావడంతో సందడి నెలకొంది. ముఖేష్ అంబానీ భారతదేశపు అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్ జియోను నిర్వహిస్తున్నారు. ఆసియాలోనే అత్యంత సంపన్నుడు గౌతమ్ అదానీ 5జీ వేలంలోకి అడుగుపెట్టాడు. రానున్న రోజుల్లో ఇద్దరు ప్రముఖ పారిశ్రామిక వేత్తల మధ్య ఆసక్తికర పోటీ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ముఖేష్ అంబానీ తన టెలికాం వ్యాపారాన్ని ఇతర దేశాలకు విస్తరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గౌతమ్ అదానీ కూడా స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేస్తారని నివేదికలు చెబుతున్నాయి.

ప్రస్తుతానికి టెలికాం రంగంలోకి ప్రవేశించేందుకు గౌతం అదానీ నిరాకరించారు. వైర్‌లెస్ టెలికమ్యూనికేషన్ కోసం అతనికి లైసెన్స్ కూడా లేదు. అయితే రానున్న కాలంలో అదానీ వైర్‌లెస్ సేవల్లోకి రావడాన్ని అంబానీ సలహాదారులు ఏ మాత్రం ఖండించడం లేదు. రిలయన్స్ జియో భారతదేశం వెలుపల, ఇతర దేశాలలో తన మార్కెట్ కోసం ప్రయత్నించాలని కొంతమంది సహచరుల సలహా ఇస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే కాలంలో టెలికాం వ్యాపారానికి ఎదురయ్యే సవాళ్ల కోసం కంపెనీ నిధులు సేకరించాలని కూడా కొందరు చెబుతున్నట్లు తెలుస్తోంది.

కాగా, ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో అదానీ నాలుగో స్థానంలో ఉన్నారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. గౌతమ్ అదానీ నికర విలువ $118 బిలియన్లతో ప్రపంచంలోని నాల్గవ సంపన్న వ్యక్తి. ముకేశ్ అంబానీ 89.6 బిలియన్ డాలర్లతో 11వ స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు గౌతమ్ అదానీ సంపద 41.8 బిలియన్ డాలర్లు పెరిగింది. ఈ విషయంలో అతను ప్రపంచంలోనే నంబర్ వన్‌గా ఉన్నాడు. మారుతున్న పరిస్థితుల మధ్య, ముఖేష్ అంబానీ తెలివిగా జియో వ్యాపారాన్ని భారతదేశంలోనే కొనసాగిస్తున్నారు. అంబానీ, అదానీల మధ్య పోటీ మరింత కఠినంగా మారుతుందని ముంబైకి చెందిన ఇన్వెస్ట్‌మెంట్‌ సలహా సంస్థ KRIS వ్యవస్థాపకుడు అరుణ్ కేజ్రీవాల్ అన్నారు. అయితే రానున్న రోజుల్లో అదానీ గ్రూప్ కూడా మొబైల్ మార్కెట్లోకి అడుగుపెట్టాలని వస్తున్న పుకార్లు మార్కెట్లో హాట్ హాట్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

ఇప్పటి వరకు అదానీ గ్రూప్ వ్యాపారం ఓడరేవు, బొగ్గు గనులు, షిప్పింగ్‌కు సంబంధించినవి ఉన్నాయి. అంబానీ పెట్రో కెమికల్స్‌లో పెట్టుబడులు పెట్టారు. వీరిద్దరూ తమ తమ రంగాల్లో నిష్ణాతులు. ఇప్పుడు ఈ రెండు వ్యాపార సంస్థల మధ్య వివాదం మొదలైంది. కొన్ని నెలల క్రితం అంబానీ తన ఇంధన వ్యాపారంలో 20 శాతం సౌదీ అరేబియాకు చెందిన అరమ్‌కోకు విక్రయించడానికి నిరాకరించారు. ఇది 2 సంవత్సరాల క్రితమే జరిగింది. రిలయన్స్ ఆదాయానికి ముడి చమురు ప్రధాన కారకం. ఈ డీల్ రద్దయిన కొద్ది రోజుల తర్వాత అదానీ గ్రూప్ అరమ్‌కోతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి.

క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీపై ప్రధాని మోదీ దృష్టి సారించింది. ఈ దిశగా రానున్న సంవత్సరాల్లో రెండు గ్రూపులు $70 బిలియన్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించాయి. ఇది కాకుండా డిజిటల్ సర్వీస్, స్పోర్ట్స్, రిటైల్, పెట్రోకెమికల్, మీడియా వ్యాపారంపై అదానీ దృష్టిని పెంచింది. ఇప్పటికే ఈ రంగాలన్నింటిలోనూ అంబానీ ఉనికిని చాటుకున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి