Tata Punch CNG: కారులో షికారుకెళ్దామా..? ట్విన్‌ సిలిండర్స్‌తో టాటా పంచ్‌ న్యూ వేరియంట్‌… ధరెంతో తెలుసా?

కారు ఎంత తక్కువ ధరకు వచ్చినా పెరుగుతున్న పెట్రోల్‌ ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. అందువల్ల పెట్రోల్‌ కార్లకు ప్రత్యామ్నాయంగా వస్తున్న సీఎన్‌జీ, ఈవీ కార్లను రిలీజ్‌ చేస్తున్నాయి. తాజాగా ప్రజాదరణ పొందిన టాటా పంచ్‌ కారు ప్రస్తుతం సీఎన్‌జీ  మోడల్‌లో కంపెనీ రిలీజ్‌ చేసింది. ఇప్పటికే ఈ కంపెనీ రిలీజ్‌ చేసిన అల్ట్రోజ్‌ సీఎన్‌జీ వెర్షన్‌ ఆదరణ పొందడంతో సీఎన్‌జీ కార్లను రిలీజ్‌ చేస్తుంది.

Tata Punch CNG: కారులో షికారుకెళ్దామా..? ట్విన్‌ సిలిండర్స్‌తో టాటా పంచ్‌ న్యూ వేరియంట్‌… ధరెంతో తెలుసా?
Punch Cng

Updated on: Aug 05, 2023 | 6:00 PM

సొంత కారు అనేది చాలా మంది భారతీయులకు కల. కుటుంబం మొత్తం షికారు చేయడానికి కారు కొనుగోలు చేయాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. అయితే భారతదేశంలో ఎక్కువ మధ్యతరగతి ప్రజలే ఉంటారు. కాబట్టి వారికి అందుబాటులో ధరల్లో ఉండేలా అన్ని కంపెనీలు తక్కువ ధరకే కార్లను రిలీజ్‌ చేస్తున్నాయి. అయితే కారు ఎంత తక్కువ ధరకు వచ్చినా పెరుగుతున్న పెట్రోల్‌ ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. అందువల్ల పెట్రోల్‌ కార్లకు ప్రత్యామ్నాయంగా వస్తున్న సీఎన్‌జీ, ఈవీ కార్లను రిలీజ్‌ చేస్తున్నాయి. తాజాగా ప్రజాదరణ పొందిన టాటా పంచ్‌ కారు ప్రస్తుతం సీఎన్‌జీ  మోడల్‌లో కంపెనీ రిలీజ్‌ చేసింది. ఇప్పటికే ఈ కంపెనీ రిలీజ్‌ చేసిన అల్ట్రోజ్‌ సీఎన్‌జీ వెర్షన్‌ ఆదరణ పొందడంతో సీఎన్‌జీ కార్లను రిలీజ్‌ చేస్తుంది. ముఖ్యంగా ట్విన్‌ సిలిండర్‌ టెక్నాలజీతో ఈ కార్లను రిలీజ్‌ చేస్తుంది. టాటా టియాగో, టిగోర్‌లో ఈ సిలిండర్తో రిలీజ్‌ చేసిన కంపెనీ తాజాగా టాటా పంచ్‌ కారులో కూడా ట్విన్‌ సిలిండర్‌ టెక్నాలజీ మిలితం చేసింది. ఈ టాటా పంచ్‌ కార్‌ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

టాటా పంచ్‌ సీఎన్‌జీ కారు మూడు వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది. ప్యూర్‌, అ​డ్వెంచర్‌, అకాప్లిష్డ్‌ వేరియంట్స్‌లో వినియోగదారులు ఈ కారును సొంతం చేసుకోవచ్చు. ఈ కారు ధర కూడా వేరియంట్‌ను బట్టి రూ.7.10 లక్షల నుంచి రూ.9.68 లక్షల వరకూ ఉంటుంది. ఈ కారు అడ్వెంచర్‌ వేరియంట్‌ రిథమ్‌ ప్యాక్‌తో, అకాంప్లిష్డ్‌ వేరియంట్‌ డాజిల్‌ ఎస్‌ ప్యాక్‌తో అందిస్తున్నారు. ఈ కారు 1.2 లీటర్‌ త్రీ సిలిండర్‌ ఇంజిన్‌తో వస్తుంది. పెట్రోల్‌పై నడుస్తున్నప్పుడు 84.82 బీహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. సీఎన్‌జీలో ఉన్పప్పుడు 75.94 బీహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. వేరియంట్‌ను బట్టి 5 స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌ లేదా ఆటోమెటిక్‌ గేర్స్‌తో ఈ కారు అందుబాటులో ఉంటుంది. ఈ కార్‌ సీఎన్‌జీ సిలిండర్‌లు ప్రత్యేకంగా డిజైన్‌ చేయడంతో కారు డిక్కీలో సామగ్రి పెట్టుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది. ఈ సీఎన్‌జీ వాహనాలు అధిక భద్రతా ఫీచర్లతో వస్తున్నాయి. యాంటీ రస్ట్‌ మెటీరియల్‌తో ఈ కార్‌ను డిజైన్‌ చేసినందున చాలా సౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా పెట్రోల్‌ ట్యాంక్‌ ఓపెన్‌ చేసి ఉంటే కారులో ఇండికేటర్‌ చూపుతుంది. అలాగే సీఎన్‌జీ గేజ్‌ను చూపడానికి ఇనుస్ట్రుమెంట్‌ క్లస్టర్‌ అప్‌డేట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..