Tata Neu: ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీలోకి టాటా న్యూ.. తొలుత ఆ రెండు సిటీల్లో సేవలు షురూ!

టాటా గ్రూప్‌కి చెందిన మల్టీపర్పస్‌ సూపర్‌ యాప్‌ టాటా న్యూ సెకండ్‌ వార్షికోత్సవం నాటికి మరో వినూత్న రంగంలోకి అడుగుపెట్టబోతోంది. దీని డిజైన్‌ను రిఫ్రెష్‌ చేసే యోచనలో ఉంది. ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) వేదికగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ స్పేస్‌లోకి ప్రవేశించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వీరు వెల్లడించిన వివరాల ప్రకారం సాంకేతిక అంశాల కారణంగా యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ (యూఐ)..

Tata Neu: ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీలోకి టాటా న్యూ.. తొలుత ఆ రెండు సిటీల్లో సేవలు షురూ!
Tata Neu

Updated on: Mar 26, 2024 | 7:41 AM

ముంబై, మార్చి 26: టాటా గ్రూప్‌కి చెందిన మల్టీపర్పస్‌ సూపర్‌ యాప్‌ టాటా న్యూ సెకండ్‌ వార్షికోత్సవం నాటికి మరో వినూత్న రంగంలోకి అడుగుపెట్టబోతోంది. దీని డిజైన్‌ను రిఫ్రెష్‌ చేసే యోచనలో ఉంది. ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) వేదికగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ స్పేస్‌లోకి ప్రవేశించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వీరు వెల్లడించిన వివరాల ప్రకారం సాంకేతిక అంశాల కారణంగా యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ (యూఐ) డిజైన్‌ను బ్లాక్‌ నుంచి వైట్‌ బ్యాక్‌గ్రౌండ్‌లోకి మార్చనుంది.

కాగా 2022 ఏప్రిల్‌ 7న టాటా గ్రూప్‌ సూపర్‌ యాప్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. యూఐలో మార్పులు చేసి చాలా కాలం గడిచింది. టెక్ రీజనింగ్ ప్రకారం.. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లో అధిక లావాదేవీలు జరిపినప్పుడు తెలుపు రంగు ప్రాధాన్యతనిస్తుంది. విడ్జెట్‌ల మధ్య ఖాళీ 15-20 శాతం తగ్గుతుందని డెవలపర్ తెలిపారు. తొలుత దీనిని క్లోజ్డ్ యూజర్ గ్రూప్ కోసం ప్రారంభించనున్నారు. అందువల్ల కేవలం రెండు నగరాల్లో అందుబాటులోకి వస్తుంది. అవి బెంగళూరు, ఢిల్లీ నగరాలు కావచ్చు అని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

ONDC, మ్యాజిక్‌పిన్‌తో కలిసి టాటా న్యూ తన ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభిస్తున్నట్లు వారు తెలిపారు. గతేడాది జరిగిన ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్ సందర్భంగా మ్యాజిక్‌పిన్‌ ఫుడ్ ఆర్డర్‌లు రెండింతలు పెరిగాయి. గత నెలలో కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టిన నవీన్ తహిల్యాని నియామకం నేపథ్యంలో టాటా న్యూ పలు మార్పులకు తెరతీసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తహిల్యానీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఆయన పలు సమీక్షా సమావేశాలు నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.