Tata Motors: టాటా మోటార్స్‌తో చేతులు కలిపిన ఐసీఐసీఐ బ్యాంకు.. ఎలక్ట్రిక్‌ వాహనాలపై కీలక ఒప్పందం

|

Jan 23, 2023 | 9:48 PM

ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ క్రమంగా పెరుగుతోంది. ప్రజలు నిరంతరం ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరల కారణంగా ప్రజల జేబులకు కూడా చిల్లులు పడుతున్నాయి..

Tata Motors: టాటా మోటార్స్‌తో చేతులు కలిపిన ఐసీఐసీఐ బ్యాంకు.. ఎలక్ట్రిక్‌ వాహనాలపై కీలక ఒప్పందం
Tata Motors
Follow us on

ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ క్రమంగా పెరుగుతోంది. ప్రజలు నిరంతరం ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరల కారణంగా ప్రజల జేబులకు కూడా చిల్లులు పడుతున్నాయి. మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాలలో పెట్రోల్, డీజిల్ ధర ఆదా అవుతుంది. దీని కారణంగా వాహనదారులు కూడా ఈవీ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్ చేతులు కలిపాయి. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల అధీకృత డీలర్లకు ఆర్థిక పరిష్కారాలను అందించడానికి టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనికి సంబంధించి ఓ ప్రకటన కూడా విడుదల చేశారు.

ఈ సందర్భంగా టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర మాట్లాడుతూ.. ఈ భాగస్వామ్యం ద్వారా మేము ఎలక్ట్రిక్ వాహనాలను మరింత సులభంగా, మా వినియోగదారులకు కొనుగోలు ప్రక్రియను సులభతరం చేయగలమని మేము విశ్వసిస్తున్నాము అని అన్నారు.

ఈ ఒప్పందంతో ఎలక్ట్రిక్ వాహనాల డీలర్లు ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవచ్చని ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ తెలిపింది. ఐసిఐసిఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ ఝా మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని, వినియోగదారులలో పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ కూడా పెరుగుతోందని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి