సూరత్‌లోని వజ్రాల పరిశ్రమలో కరోనా కలకలం

| Edited By: Pardhasaradhi Peri

Jun 13, 2020 | 4:58 PM

సూరత్‌లోని వజ్రాల పరిశ్రమలో కరోనా కలకలం స‌ృష్టిస్తోంది. అక్కడ పనిచేస్తున్న 23 మంది కార్మికులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు సూరత్ మున్సిపల్ కార్పోరేషన్ (ఎస్ఎంసీ) అధికారులు. వారు పనిచేస్తున్న పరిశ్రమలను పూర్తిగా క్లోజ్ చేశారు...

సూరత్‌లోని వజ్రాల పరిశ్రమలో కరోనా కలకలం
Follow us on

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా సురత్ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారు నిర్వహించిన పరీక్షల్లో 23 మంది వజ్రాల పరిశ్రమలో పనిచేసే కార్మికులకు కరోనా పాజిటివ్ తేలింది. దీంతో వారు పనిచేస్తున్న ప్రాంతాలను రెడ్ జోన్ గా గుర్తించారు. ఆ యూనిట్లను పూర్తిగా శానిటైజ్‌ చేసి భవనాన్ని సీజ్‌ చేశారు. వీరితో పనిచేస్తున్నవారికి 14 రోజుల పాటు క్వారైంటన్ విధించారు.