సుకన్య సమృద్ధి యోజన 2021: పోస్టాఫీసులో వడ్డీ రేట్లు చెక్ చేయండిలా.. ప్రయోజనాలెంటో తెలుసా..

|

Apr 25, 2021 | 1:40 PM

Sukanya Samriddhi Yojana 2021: కేంద్ర ప్రభుత్వం ఆడ పిల్లల కోసం అందిస్తోన్న స్కీమ్ సుకన్య సమృద్ది యోజన.

సుకన్య సమృద్ధి యోజన 2021: పోస్టాఫీసులో వడ్డీ రేట్లు చెక్ చేయండిలా.. ప్రయోజనాలెంటో తెలుసా..
Sukanya Samriddhi Yojana
Follow us on

Sukanya Samriddhi Yojana 2021: కేంద్ర ప్రభుత్వం ఆడ పిల్లల కోసం అందిస్తోన్న స్కీమ్ సుకన్య సమృద్ది యోజన. ఇందులో కేవలం ఆడ పిల్లలు మాత్రమే చేరడానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఇందులో చేరోచ్చు. ఈ పథకం వలన అమ్మాయిలకు ఆర్థిక భద్రత ఉంటుంది. ఇందులో పెట్టుబడి పెట్టడం వలమ మీ అమ్మాయి కలలను సాధ్యం చేయవచ్చు. ఇందులో చేరితే ప్రస్తుతం 7.6 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఈ పథకంలో చేరాలని భావించే వారు బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లితే సరిపోతుంది. సులభంగానే ఈ స్కీమ్‌లో చేరొచ్చు. అయితే పాప బర్త్ సర్టిఫికెట్ కచ్చితంగా ఉండాలి.

ఈ పథకంలో ఎవరు చెరవచ్చు అంటే..

1. 10 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న ఆడపిల్లల పేరిట వారి సంరక్షకులు ఈ ఖాతాను ఓపెన్ చేయవచ్చు.

2. పోస్టాఫీసులో లేదా బ్యాంకులలోనైనా సుకన్య సమృద్ధఝి యోజన ఖాతాను ఓపెన్ చేయవచ్చు..

3. ఒక కుటుంబంలోని ఇద్దరు బాలికలకు ఈ ఖాతా ఓపెన్ చేయవచ్చు. కవలలు లేదా ముగ్గురు కూడా రెండు కంటే ఎక్కువ ఖాతాలు తెరవవచ్చు.

4. ఈ ఖాతాను ఓపెన్ చేయడానికి కనీసం రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.

5. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. ఇకపోతే ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు. అంటే స్కీమ్‌లో చేరి 21 ఏళ్ల తర్వాతనే డబ్బులు తీసుకోగలం.

6. ఏడాదిలో రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే అమ్మాయికి 18 ఏళ్లు దాటిన తర్వాత కొంత డబ్బు తీసుకోవచ్చు. మీరు సుకన్య సమృద్ధి ఖాతా తెరిచిన దగ్గరి నుంచి 15 ఏళ్లు డబ్బులు డిపాజిట్ చేసుకుంటూ వెళ్లాలి.

7. ఉదాహరణకు మీరు నెలకు రూ.3 వేలు ఇన్వెస్ట్ చేస్తూ వెలితే మెచ్యూరిటీ కాలంలో రూ.15 లక్షలకు పైగా పొందొచ్చు. అంటే రోజుకు రూ.100 ఆదా చేస్తే సరిపోతుంది.

ట్వీట్..

Also Read: PM Kisan: రైతుల అకౌంట్లోకి రూ.2 వేలు.. మీకు వస్తాయో లేదో తెలుసుకోండి.. ఎలా చెక్ చెయాలంటే..

HDFC ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న బ్యాంక్.. మళ్లీ ఆ సర్వీసులు అందుబాటులోకి..