కశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్తత.. దేశీయ స్టాక్ మార్కెట్లపై పడింది. దీంతో సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 10.46 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ 600.75 పాయింట్లు నష్టపోయి 36,517 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 181.85 పాయింట్లు కోల్పోయి 10,815 వద్ద ట్రేడవుతోంది.
హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా.. ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్, బ్రిటానియా, బజాజ్ ఫినాన్స్, హీరో మోటార్‌కార్ప్, డీహెచ్‌ఎఫ్‌ఎల్, ఎల్‌ఐసీ హౌసింగ్, ఇండియా బుల్స్ హౌసింగ్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.