ఇటు సెన్సెక్స్(Sensex), అటు నిఫ్టీ(Nifty) రెండు సూచీలు భారీగా నష్టపోయాయి. ఒక్కరోజులోనే రూ. 2.56 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్ఫోసిస్ షేరు ధర ఒక్క రోజులో 124 రూపాయలు పడిపోవడంతో ఆ కంపెనీ మార్కెట్ విలువలో సుమారు 48 వేల కోట్ల రూపాయల సంపద క్షణాల్లో కనిపించకుండా పోయింది. బ్యాంకు నిఫ్టీ సూచీ భారీగా నష్టపోయింది. ఇన్ఫోసిస్ తర్వాత కోటక్‌మహీంద్రా, టెక్ మహీంద్రా షేర్లు కూడా నష్టపోయాయి. ఇంతటి నష్టాల్లో కూడా ఎన్టీపీసీ, టాటా స్టీల్, బజాజ్ ఆటో షేర్లు లాభాలను మూటగట్టుకున్నాయి. కర్ణుడి చావుకు వెయ్యి కారణాలు ఉన్నట్లే సోమవారం మార్కెట్లు పడిపోవడానికి కూడా చాలా కారణాలున్నాయి. అంతర్జాతీయంగా డాలర్ఇండెక్స్ 100కుపైగా చేరుకోవటం వల్ల మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడింది.
షాంగైలో చాలా కాలంగా కొనసాగుతున్న లాక్డౌన్, మార్చిలో దేశీయంగా పెరిగిపోయిన ద్రవ్యోల్బణం, ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్..వీటితోపాటు పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు, అంచనాలను అందుకోలేకపోయిన ఐటీ కంపెనీల పనితీరు. ప్రతికూలంగా కదలాడుతున్న అంతర్జాతీయ మార్కెట్ సూచీలు.. ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను తీవ్రంగా ఎఫెక్ట్ చూపించాయి.
దీంతో ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతలతో దేశీయ మార్కెట్లు కుప్పకూలాయి. దేశీయ ఐటీ సెక్టార్ ఏకంగా 4 శాతం, బ్యాంకు ఇండెక్స్ 2 శాతం మేర నష్టపోవటమూ ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకుల పేలవమైన ఫలితాల తరువాత, మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. దీని కారణంగా పెట్టుబడిదారులు భారీ నష్టాలను చవిచూశారు.
ఈ ఏడాది మార్చిలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.95 శాతం మేర నమోదైంది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. జూన్‌లో ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్షా సమావేశంలో వడ్డీ రేట్ల పెంపునకు ఆస్కారం ఉందని అంటున్నారు. 2023 ఏప్రిల్ నాటికి రెపోరేటు 5.5 శాతానికి చేరుకుంటుందని హెచ్ఎస్బీసీ అంచనా వేసింది.
స్టాక్ మార్కెట్ ముగింపు:
ఈరోజు స్టాక్ మార్కెట్ లో భారీ క్షీణత నెలకొంది. ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకుల పేలవమైన ఫలితాల తరువాత మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. దీని కారణంగా పెట్టుబడిదారులు భారీ నష్టాలను చవిచూశారు.
సెన్సెక్స్-
నిఫ్టీలో అమ్మకాలు నేటి ట్రేడింగ్ తర్వాత, సెన్సెక్స్ 1172.19 పాయింట్లు లేదా 2.01 శాతం పతనంతో 57,166.74 స్థాయి వద్ద ముగిసింది. అదే సమయంలో, నిఫ్టీ ఇండెక్స్ 302.00 పాయింట్లు/1.73 శాతం పడిపోయి 17,173.65 స్థాయి వద్ద ముగిసింది.
సెక్టోరల్ ఇండెక్స్‌లో క్షీణత సెక్టోరల్
ఇండెక్స్‌ను పరిశీలిస్తే, నేటి ట్రేడింగ్ తర్వాత చాలా రంగాలు రెడ్ మార్క్‌లో ముగిశాయి. నేటి వ్యాపారంలో నిఫ్టీ ఆటో, మెటల్, ఎఫ్‌ఎంసిజి రంగాల్లో కొనుగోళ్లు జోరందుకున్నాయి. ఇవే కాకుండా నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ, మీడియా, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, రియల్టీ, హెల్త్‌కేర్, కన్స్యూమర్ డ్యూరబుల్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు నష్టాల్లో ముగిశాయి.
టాప్ గెయినర్, లూజర్ స్టాక్
సెన్సెక్స్ టాప్ 30 స్టాక్‌ల జాబితాను ఓసారి పరిశీలిస్తే.. ఇవాళ్టి టాప్ గెయినర్ స్టాక్ ఎన్‌టిపిసి. ఎన్‌టీపీసీ షేర్లు 6.50 శాతం లాభంతో 163 వద్ద ముగిశాయి. ఇది కాకుండా, నేటి టాప్ లూజర్ స్టాక్ ఇన్ఫోసిస్. ఇన్ఫోసిస్ షేర్లు 7 శాతానికి పైగా పడిపోయి 1621 స్థాయి వద్ద ముగిశాయి. NTPCతో పాటు, టాటా స్టీల్, మారుతీ, టైటాన్, M&M, HUL, పవర్ గ్రిడ్, నెస్లే ఇండియా, యాక్సిస్ బ్యాంక్ , ITC షేర్లు సోమవారం లాభాలను దక్కించుకున్నాయి.
క్షీణిస్తున్న స్టాక్‌ల
జాబితాలో ఇన్ఫోసిస్‌తో పాటు , హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, టెక్‌ఎమ్, విప్రో, టిసిఎస్, హెచ్‌సిఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్, కోటక్ బ్యాంక్, ఎస్‌బిఐ, భారతీ ఎయిర్‌టెల్, అల్ట్రా కెమికల్, ఎల్‌టి, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఫార్మా షేర్లు , ఇండస్‌ఇండ్ బ్యాంక్, డాక్టర్ రెడ్డి, ఐసిఐసిఐ బ్యాంక్ , రిలయన్స్ రెడ్ మార్క్‌లో ముగిశాయి.
ఇవి కూడా చదవండి: Viral Video: ఈ పిల్లి టాలెంట్ అదుర్స్.. ఏకంగా మట్టి పాత్రలనే తయారు చేస్తోందిగా.. వీడియో వైరల్..