PAN Card: పాన్‌ కార్డ్‌లో ఇంటి పేరును ఎలా మార్చుకోవాలో తెలుసా.? ఈ స్టెప్స్‌ ఫాలో అవ్వండి..

|

Jan 07, 2023 | 4:24 PM

బైక్‌ నుంచి కారు వరకు, చిన్న ఫ్లాట్‌ నుంచి ఇంటి వరకు ఏ కొనుగొలు చేయాలన్నా పాన్‌ కార్డ్‌ అవసరం తప్పనిసరిగా మారింది. బ్యాంకు లావాదేవీల్లోనూ పాన్‌ కార్డ్‌ వినియోగం అనివార్యంగా మారింది. గుర్తింపు కార్డుగా పాన్‌ కార్డ్‌లను ఉపయోగించే రోజులు వచ్చేశాయ్‌. దీంతో ప్రతీ ఒక్కరూ కచ్చితంగా పాన్‌ కార్డ్‌ ఉండేలా చూసుకుంటున్నారు. ఇదిలా ఉంటే..

PAN Card: పాన్‌ కార్డ్‌లో ఇంటి పేరును ఎలా మార్చుకోవాలో తెలుసా.? ఈ స్టెప్స్‌ ఫాలో అవ్వండి..
Pan Card
Follow us on

బైక్‌ నుంచి కారు వరకు, చిన్న ఫ్లాట్‌ నుంచి ఇంటి వరకు ఏ కొనుగొలు చేయాలన్నా పాన్‌ కార్డ్‌ అవసరం తప్పనిసరిగా మారింది. బ్యాంకు లావాదేవీల్లోనూ పాన్‌ కార్డ్‌ వినియోగం అనివార్యంగా మారింది. గుర్తింపు కార్డుగా పాన్‌ కార్డ్‌లను ఉపయోగించే రోజులు వచ్చేశాయ్‌. దీంతో ప్రతీ ఒక్కరూ కచ్చితంగా పాన్‌ కార్డ్‌ ఉండేలా చూసుకుంటున్నారు. ఇదిలా ఉంటే పాన్‌ కార్డ్ తీసుకున్న తర్వాత వాటిలో మార్పులు చేర్పులు చేసుకోవడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా పేరు, అడ్రస్‌ వంటి మార్పులు ఎలా చేసుకోవాలో ప్రతీ ఒక్కరికీ తెలిసే ఉంటుంది. అయితే మహిళలు వివాహామైన తర్వాత ఇంటి పేరు ఎలా మార్చుకోవాలన్న దానిపై మాత్రం చాలా మందికి క్లారిటీ ఉండదు. అయితే ఇంట్లో నుంచే ఈ పనిని పూర్తి చేయొచ్చని మీకు తెలుసా.? ఇంతకీ పాన్‌ కార్డులో ఇంటి పేరును ఎలా మార్చుకోవాలి.? ఇందుకోసం పాటించాల్సిన స్టెప్స్‌ ఏంటి.? లాంటి వివరాలు మీకోసం..

* ఇందుకోసం ముందుగా www.tin-nsdl.com వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

* అనంతరం అందులో సర్వీసెస్‌ విభాగంలో PAN అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

ఇవి కూడా చదవండి

* తర్వాత కింద Change/Correction in PAN Data అనే ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి.

* తర్వాత ‘అప్లికేషన్‌ టైప్‌’ ను ఎంచుకొని అందులో.. ‘ఛేంజేస్‌ ఆర్‌ కరెక్షన్‌ ఇన్‌ ఎగ్జిస్టింగ్ పాన్‌ డేటా’ అని సెలక్ట్‌ చేసుకోవాలి.

* పాన్‌ నెంబర్‌, పేరు, పుట్టిన తేదీ, ఈమెయిల్‌, ఫోన్‌ నెంబర్‌ వంటి వివరాలను అందించాలి.

* సబ్‌మిట్ చేయగానే మీకు ఒక టోకెన్‌ నెంబర్‌ వస్తుంది.

* ఆ తర్వాత కింద బటన్‌ నొక్కగానే పేరు కరెక్షన్‌కు సంబంధించిన పేజీ ఓపెన్‌ అవుతుంది.

* అక్కడ పేరు, పుట్టినరోజు, ఫోన్‌ నంబరు, ఇలా ఇక్కడ అన్నింటినీ మార్చుకొనే వీలుంటుంది.

* ఇందులో మీరు మార్చాలనుకుంటున్న వాటిని మార్చుకోవాలి. ఆ తర్వాత నిర్ధేశించిన పేమెంట్‌ను చెల్లించాల్సి ఉంటుంది.

* చివరిగా మీరు కార్డును అప్‌డేట్‌ చేసినట్లు ఓ స్లిప్‌ వస్తుంది. దానిని డౌన్‌లోడ్ చేసుకోని.. దానిపై రెండు ఫొటోలు అతికించి సంబంధిత పత్రాలను ఎన్‌ఎస్‌డీఎల్‌ కార్యాలయానికి పంపించాలి.

* ఎన్‌ఎస్‌డీఎల్‌ అడ్రస్‌: NSDL e-Gov at Income Tax PAN Services Unit, NSDL e-Governance Infrastructure Limited, 5th Floor, Mantri Sterling, Plot No. 341, Survey No. 997/8, Model Colony, Near Deep Bungalow Chowk, Pune- 411016

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..