దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(State Bank Of India) అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. యోనో(Yono App) యాప్ ద్వారా ‘రియల్ టైం ఎక్స్‌ప్రెస్ క్రెడిట్’ అనే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా బ్యాంకు సంబంధిత బ్రాంచ్‌కు వెళ్లకుండానే ఇంటి దగ్గర నుంచే పర్సనల్ లోన్‌ను పొందొచ్చు. వ్యక్తిగత రుణం కోసం రియల్ టైం ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ తీసుకోవాలనుకునేవారు యోనో యాప్ ద్వారా అప్లయ్ చేసుకోవాలి. అర్హులైన కస్టమర్లకు డిజిటల్ పద్దతిలో డాక్యుమెంటేషన్ పూర్తయి క్షణాల్లో రూ. 35 లక్షల వరకు వ్యక్తిగత లోన్ మంజూరు అవుతుంది. ఖాతాదారులకు సౌలభ్యాన్ని అందించడంతో పాటు వారికి డిజిటల్‌గా సాధికారత కల్పించడమే లక్ష్యంగా బ్యాంకు ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ‘రియల్ టైం ఎక్స్‌ప్రెస్ క్రెడిట్'(RTXC) గురించి వివరిస్తూ ట్విట్టర్ వేదికగా ఎస్‌బీఐ ఓ ప్రకటన విడుదల చేసింది.
రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, డిఫెన్స్, సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో పనిచేసే వారు ఈ ప్రయోజనాన్ని పొందగలరని బ్యాంక్ తెలిపింది. ఇకపై వారు వ్యక్తిగత రుణం కోసం బ్యాంక్‌ను సందర్శించాల్సిన అవసరం లేదని పేర్కొంది. క్రెడిట్ హిస్టరీ, అర్హత, డాక్యుమెంటేషన్ మొత్తం రియల్ టైమ్‌లో డిజిటల్ పద్దతిలో పూర్తవుతుందని SBI తెలిపింది. అలాగే ఈ లోన్ వడ్డీ రేట్లు తక్కువని వెల్లడించింది. మరోవైపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) బల్క్ టర్మ్ డిపాజిట్లపై (రూ. 2 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ) వడ్డీ రేటును 40 నుండి 90 బేసిస్ పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే. ఇక పెరిగిన వడ్డీ రేట్లు మే 10వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన విషయం విదితమే.
Say yes to your dreams!
Introducing Real Time Xpress Credit (RTXC) for our eligible salaried customers.
Easy and instant loan up to 35 lakhs on Yono app.#RTXC #PersonalLoan #StateBankOfIndia #AmritMahotsav #AzadiKaAmritMahotsavWithSBI pic.twitter.com/Oiz6alDiBx— State Bank of India (@TheOfficialSBI) May 23, 2022