SBI YONO: ఎస్‌బీఐ యోనో యాప్‌ ద్వారా 3 నెలల్లో రూ. 100 కోట్ల ఆదాయం

|

Sep 06, 2023 | 3:26 PM

ప్రస్తుతం 85 శాతం బ్యాంకు లావాదేవీలు ఈ యోనో యాప్ ద్వారానే జరుగుతున్నాయని ఎస్‌బీఐ బ్యాంకు చైర్మన్ దినేష్ కుమార్ ఖరా తెలిపారు. ఈ యాప్ సహాయంతో వినియోగదారులు మ్యూచువల్ ఫండ్స్, జీవిత బీమాను కూడా కొనుగోలు చేయవచ్చని తెలిపారు. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం రూ.21,000 కోట్ల వ్యక్తి గత రుణాలను కూడా ఇచ్చింది. దీనితో పాటు, ఇప్పుడు ఎస్‌బీఐ తన కస్టమర్లకు..

SBI YONO: ఎస్‌బీఐ యోనో యాప్‌ ద్వారా 3 నెలల్లో రూ. 100 కోట్ల ఆదాయం
Sbi
Follow us on

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వినియోగదారుల నుంచి భారీగానే లాభాలు ఆర్జిస్తోంది. ఎస్‌బీఐ (SBI) యోనో యాప్‌ (YONO) ద్వారా ప్రతి త్రైమాసికంలో తన కస్టమర్ల నుంచి రుసుము రూపంలో రూ.100 కోట్లు సంపాదిస్తోంది. విశేషమేమిటంటే ఈ యాప్ ద్వారా ఎస్‌బీఐ తన ఉత్పత్తులను తన కస్టమర్లకు విక్రయిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి యోనో రుణం దాదాపు 30 వేల కోట్ల వరకు చేరుకునే అవకాశం ఉందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ యాప్ 2014 సంవత్సరంలో కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది బ్యాంకు.

ప్రస్తుతం 85 శాతం బ్యాంకు లావాదేవీలు ఈ యోనో యాప్ ద్వారానే జరుగుతున్నాయని ఎస్‌బీఐ బ్యాంకు చైర్మన్ దినేష్ కుమార్ ఖరా తెలిపారు. ఈ యాప్ సహాయంతో వినియోగదారులు మ్యూచువల్ ఫండ్స్, జీవిత బీమాను కూడా కొనుగోలు చేయవచ్చని తెలిపారు. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం రూ.21,000 కోట్ల వ్యక్తి గత రుణాలను కూడా ఇచ్చింది. దీనితో పాటు, ఇప్పుడు ఎస్‌బీఐ తన కస్టమర్లకు యోనో యాప్ ద్వారా ప్రీ-అప్రూవ్డ్ బిజినెస్ లోన్‌లను కూడా అందిస్తోందని ఎస్‌బీఐ తెలిపింది.

100 కోట్ల రూపాయలు సంపాదిస్తోంది

వాస్తవానికి మంగళవారం జరిగిన ఐదవ గ్లోబల్ ఫిన్‌టెక్ సమ్మిట్ సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ దినేష్ కుమార్ ఖరా ఈ విషయాలు చెప్పారు. లైఫ్, జనరల్ ఇన్సూరెన్స్ బ్రాంచ్‌లు, మ్యూచువల్ ఫండ్స్, ఇతర అనుబంధ సంస్థల నుంచి ఉత్పత్తులను విక్రయించడం ద్వారా ప్రతి త్రైమాసికంలో యోనో ద్వారా భారీ ఎత్తున లాభాలు పొందుతోంది. అయితే ప్రతి త్రైమాసికంలో చూస్తే దాదాపు రూ.100 కోట్ల రుసుములను ఆర్జిస్తున్నట్లు ఆయన తెలిపింది.

దినేష్ కుమార్ ఖరా ప్రకారం.. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ప్రజలకు 21,000 కోట్ల రూపాయల వ్యక్తిగత రుణాలను అందించింది. ఇప్పుడు యోనో ద్వారా ప్రీ-అప్రూవ్డ్ బిజినెస్ లోన్‌లను కూడా పెంచామని, ఇప్పటికే నెలకు రూ.600 కోట్లు ఆర్జిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి యోనో యాప్ ద్వారా కనీసం రూ.29,000-30,000 కోట్లు పంపిణీ చేస్తామని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అని దినేష్ కుమార్ ఖరా తెలిపారు. అంటే యోనోకు రూ.30,000 కోట్ల లోన్ బుక్ ఉంటుంది. బ్యాంక్ తదుపరి తరం యోనో 2.0పై పని చేస్తోందని, తద్వారా బ్యాంక్ తన కస్టమర్లకు అత్యుత్తమ ఆర్థిక సౌకర్యాలను అందించగలదని చైర్మన్ చెప్పారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి