Startup Companies: భారీగా పడిపోయిన స్టార్టప్ కంపెనీల షేర్లు.. ఎందుకు ఇలా జరుగుతోంది..

|

Feb 23, 2022 | 8:41 AM

కరీంనగర్‌లో నివసించే శ్రీనివాస్ గందరగోళంలో ఉన్నారు. అతనికి ఐపీవోలో(IPO) లిస్టైన జొమాటో(Zomato) షేర్లు ఎలాట్‌మెంట్ అయ్యాయి...

Startup Companies: భారీగా పడిపోయిన స్టార్టప్ కంపెనీల షేర్లు.. ఎందుకు ఇలా జరుగుతోంది..
Stock Market
Follow us on

కరీంనగర్‌లో నివసించే శ్రీనివాస్ గందరగోళంలో ఉన్నారు. అతనికి ఐపీవోలో(IPO) లిస్టైన జొమాటో(Zomato) షేర్లు ఎలాట్‌మెంట్ అయ్యాయి. లిస్టింగ్ తర్వాత ఆ షేర్లు 53 శాతం పెరిగాయి. అతను షేర్లను అమ్మకుండా అలానే కొనసాగించాడు. 76 రూపాయల ఇష్యూ ధరతో వచ్చిన జొమాటో.. ప్రస్తుతం 86 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది గతంలో తన జీవితకాల గరిష్ఠమైన 169 రూపాయల రేటును తాకింది. తాజాగా.. మార్కెట్లో(Stock Market) ఈ షేరు పతనమై ఇష్యూ ధర కంటే తక్కువలో ట్రేడ్ అవుతోంది. ఈ పరిస్థితుల్లో కేవలం శ్రీనివాస్ మాత్రమే కాకుండా అతని లాంటి లక్షల మంది రిటైల్ మదుపరులు స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టి ఇరుక్కుపోయారు. గతంలో మంచి లాభాలను ఇచ్చిన ఆ కంపెనీల షేర్లు.. ఇప్పుడు ఎందుకు పతనమవుతున్నాయో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు.

ప్రస్తుతం జొమాటో, నైకా, పే టీఎం, పాలసీ బజార్ లాంటి అన్ని స్టార్టప్ కంపెనీల షేర్ల పరిస్థితి ఒకేలా ఉంది. ఈ స్టాక్‌లలో పెట్టుబడిదారుల సంపద 20 శాతం నుంచి 62 శాతం వరకు క్షీణించింది. ఇప్పుడు అందరి మదిలో కంపెనీల వ్యాల్యుయేషన్‌పై అనేక అనుమానాలు మెుదలయ్యాయి. ఈ కంపెనీల క్యాష్ బర్నింగ్ వ్యాపార మోడల్‌లో పెట్టుబడిదారులు లాభాలను ఆర్జించే అవకాశాలను చూడలేరని అర్థమవుతోంది. స్టార్టప్ కంపెనీలు ఇప్పటికీ లాభాలను ఆర్జించడానికి కష్టపడుతున్నాయి. వాటి విలువలు మాత్రం ఆకాశాన్ని అంటాయి. ఈ కారణాల వల్ల షేర్లు ఎక్కువగా విలువను కోల్పోతున్నాయి. సాంకేతికత ఆధారిత ఈ కంపెనీలు లిస్టింగ్ కాక ముందు పెద్దగా వెలుగులోకి రాలేదు కానీ.. ఇప్పడు అవి మార్కెట్ ఒడిదోడుకులను తీవ్రంగా ఎదుర్కొంటున్నాయని KR చోక్సీ షేర్స్ & సెక్యూరిటీస్ ఎండీ దేవేన్ చోక్సీ అభిప్రాయపడ్డారు.

సాంకేతికత ఆధారంగా వ్యాపారాలు చేస్తున్న ఈ కంపెనీలు లిస్టింగ్‌కి ముందు అంతగా ప్రాచుర్యంలో లేవు. కానీ ఇప్పుడు ఇవి మార్కెట్ ఓలటాలిటీని ఎదుర్కొంటున్నాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య రోజురోజుకూ పెరుగుతున్న ఉద్రిక్తతలు.. ఈ రకమైన కంపెనీలకు చేటుచేశాయి. దీనికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతుందనే భయాలు.. పెరుగుతున్న ద్రవ్యోల్బణం వంటివి ఈ కంపెనీల షేర్లకంటే మెరుగ్గా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం చూస్తే.. ఈ రకమైన వ్యాపారాల్లో ఉన్న కంపెనీలకు లాభాల దారి మూసుకుపోయినట్లు అనిపిస్తోంది.

పేటిఎం కంపెనీ ఆదాయాలు డిసెంబర్ 2021లో 89 శాతం మేర పెరిగి.. ఒక వేయి 456 కోట్ల రూపాయలకు చేరాయి. కానీ.. ఇదే కాలంలో కంపెనీ నష్టాలు 45 శాతం పెరిగి రూ. 778 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. డిసెంబర్ 2021తో ముగిసిన త్రైమాసికానికి కార్ ట్రేడ్ కంపెనీ 23 కోట్ల 40 లక్షల రూపాయన నష్టాన్ని నమోదుచేసింది. సంవత్సరం క్రితం కంపెనీ ఇదే కాలానికి 18 కోట్ల 20 లక్షల లాభాన్ని నమోదు చేసింది. కంపెనీ ఆదాయం 14.7 శాకం పెరిగి 89 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఆర్థిక సంవత్సరం 2021-22 లోని మూడో త్రైమాసికంలో జొమాటో తన నష్టాలను 81 శాతం మేర తగ్గించుకున్నప్పటికీ.. 67 కోట్ల 20 లక్షల రూపాయలు నష్టాన్ని నమోదు చేసింది. కానీ.. ఆదాయంలో 316 కోట్ల రూపాయలను ఫిట్సో లోని తన పెట్టుబడులను అమ్మడం ద్వారా కంపెనీ పొందినవే.పాలసీ బజార్ కంపెనీ 2021-2022 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికానికి సంబంధించి కన్సాలిడేటెజ్ నష్టం మెుత్తం 298 కోట్లుగా నమోదైంది. గత సంవత్సరం అదే కాలానికి సంబంధించి కంపెనీ స్వల్పంగా 19 కోట్ల 58 లక్షల రూపాయల నష్టాన్ని మాత్రమే నమోదు చేసింది. ఈ కాలంలో కంపెనీ ఆదాయం 212 కోట్ల రూపాయల నుంచి 376 కోట్లకు పెరిగి 73 శాతం వృద్ధిని నమోదు చేసింది.

Read Also.. Mutual Fund: మీ దగ్గర రూ. 100 ఉన్నాయా.. అయితే మ్యూచువల్‌ ఫండ్‌లో పెట్టుబడి పెట్టొచ్చు..