SIRలో మీ పేరు నమోదైందా? లేదా..? సెకన్లలోనే మీ మొబైల్‌తో చెక్‌ చేసుకోండిలా..!

Special Intensive Revision (SIR): మీరు ఏదైనా సమాచారం కోసం మీ BLOతో మాట్లాడవలసి వస్తే, అదే ఓటర్ పోర్టల్‌కు వెళ్లి, "BLOతో కాల్ బుక్ చేసుకోండి" అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఈ ఆప్షన్‌పై క్లిక్ చేసిన తర్వాత, వెతకడానికి..

SIRలో మీ పేరు నమోదైందా? లేదా..? సెకన్లలోనే మీ మొబైల్‌తో చెక్‌ చేసుకోండిలా..!
Special Intensive Revision

Updated on: Jul 21, 2026 | 6:28 PM

Special Intensive Revision (SIR): ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే చాలా మంది ఓటర్లు తమ వివరాలను విజయవంతంగా నమోదు చేసుకున్నారు. అయితే కొందరికి తమ వివరాలు నమోదు అయ్యాయా? లేదా అనే సందేహంలో ఉన్నారు. అలాంటి వారు వారివారి మొబైల్‌లోనే సులభంగా చెక్‌ చేసుకోవచ్చు. ఒక్క మెసేజ్‌ చేస్తే చాలా సెకన్లలోనే అప్‌డేట్‌ అయ్యాయా? లేదా అనేది తెలిసిపోతుంది. దీని కోసం ఎలాంటి ఇంటర్నెట్‌ అవసరం లేదు.

దీని కోసం మీరు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. కొన్ని సులభమైన దశలను అనుసరించడం ద్వారా మీరు మీ మొబైల్ ఫోన్‌ను ఉపయోగించి, మీ ఇంటి నుండే సౌకర్యవంతంగా మీ ఫారం స్థితిని తనిఖీ చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం..

SMSతో ఎలా తెలుసువాలి?

  • మీ మొబైల్‌ నుంచి1950 నంబర్‌కు మెసేజ్‌ చేయాల్సి ఉంటుంది.
  • ముందుగా మీ మొబైల్‌లో ECI అని టైప్‌ చేసి స్పెస్‌ ఇచ్చి EPIC Number ఎంటర్‌ చేయండి (ఉదాహారణకు ECI UTQ0777245)
  • SMS పంపిన కాసేపటికే ఈసీ నుంచి మీకు రిప్లై ఎస్‌ఎంఎస్‌ వస్తుంది.

ఇలా మీ మొబైల్‌ నంబర్‌కు మీ పేరు, సీరియల్‌ నెంబర్‌, నియోజకవర్గం పేరు వంటి వివరాలు వచ్చినట్లయితే మీ SIR సక్సెస్‌ అయినట్లే. అయితే ఒక వేళ ప్రాసెస్‌లో ఉంటే మీరు మీ వివరాలు సబ్మిట్‌ చేశారని, త్వరలో నమోదు పూర్తవుతుందని రిప్లై వస్తుంది.

వివరాలు రాకపోతే మీ BLOని సంప్రదించండి. కేవలం SMS రాకపోవడం కారణంగా నమోదు కాలేదని ఖచ్చితమైన ఆధారం కాదని ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు. ఎపిక్‌ నంబర్‌లో ఎలాంటి తప్పుల్లేకుండా టైప్‌ చేయాలని, మెసేజ్ పంపిన తర్వాత కాసేపు వేచి ఉండాలని సూచించారు. అయితే, కొన్నిసార్లు నెట్‌వర్క్‌ సమస్యల కారణంగా కూడా ఆలస్యంగా సమాధానం రావచ్చని, ఏవైనా సందేహాలు ఉంటే మీ ఏరియా బీఎల్‌వో లేదా ఎన్నికల అధికారులను సంప్రదించవచ్చని తెలిపారు.

వెబ్‌సైట్‌ ద్వారా..

  • ముందుగా ఎన్నికల సంఘం ఓటరు పోర్టల్ voters.eci.gov.in కు వెళ్లండి.
  • ఇక్కడ హోమ్ పేజీలో కనిపించే ‘ఫిల్ ఎన్యూమరేషన్ ఫారం’ ఎంపికపై క్లిక్ చేయండి.
  • మీరు ఇంతకు ముందు ఈ పోర్టల్‌ను ఎప్పుడూ ఉపయోగించకపోతే, సైన్ అప్ చేయడం ద్వారా కొత్త ఖాతాను సృష్టించుకోండి.
  • దీని కోసం మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడి, క్యాప్చా నమోదు చేసి రిజిస్టర్ చేసుకోండి.
  • ఇప్పటికే ఖాతా ఉన్నవారు తమ నమోదిత మొబైల్ నంబర్, పాస్‌వర్డ్ లేదా OTPతో లాగిన్ అవ్వాలి.
  • మీరు లాగిన్ అయిన తర్వాత, ‘ఫిల్ ఎన్యూమరేషన్ ఫారం’ ఎంపికను మళ్ళీ తెరవండి.
  • ఇప్పుడు ఇచ్చిన బాక్స్‌లో మీ మీ ఓటరు గుర్తింపు సంఖ్యను నమోదు చేసి సెర్చ్‌ చేయండి.
  • దీని తర్వాత మీ SIR ఫారం స్థితి స్క్రీన్‌పై కనిపిస్తుంది.

స్టేటస్‌లో ఏమి కనిపిస్తుంది?

మీ ఫారం BLO ద్వారా విజయవంతంగా సమర్పించినట్లయితే మీ స్క్రీన్‌పై “మీ ఫారం అనుసంధానించిన మొబైల్ నంబర్‌తో సమర్పించబడింది” అని ఒక సందేశం కనిపిస్తుంది. దీని అర్థం మీ దరఖాస్తు ఎన్నికల సంఘం రికార్డులలో నమోదు చేశారని అర్థం.

BLOని ఎలా సంప్రదించాలి?

మీరు ఏదైనా సమాచారం కోసం మీ BLOతో మాట్లాడవలసి వస్తే, అదే ఓటర్ పోర్టల్‌కు వెళ్లి, “BLOతో కాల్ బుక్ చేసుకోండి” అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఈ ఆప్షన్‌పై క్లిక్ చేసిన తర్వాత, వెతకడానికి మీ ఓటర్ ఐడి నంబర్, క్యాప్చాను నమోదు చేయండి. అప్పుడు BLO పేరు, మొబైల్ నంబర్ స్క్రీన్‌పై కనిపిస్తాయి. దీని ద్వారా మీరు వారిని నేరుగా సంప్రదించవచ్చు.

SIR

ఇది కూడా చదవండి: Best Scheme: కేవలం వడ్డీ నుండే రూ.50 లక్షలు సంపాదించవచ్చని మీకు తెలుసా? ధనవంతులను చేసే స్కీమ్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us