Currency Notes: భారత 11వ రాష్ట్రపతి మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, నోబెల్ పురస్కార గ్రహీత, జాతీయ గేయ రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్‌ల చిత్రాన్ని త్వరలో చూడొచ్చని తెలుస్తోంది. ఇప్పటి వరకు భారత కరెన్సీ నోట్లపై జాతిపిత మహాత్మా గాంధీ ఫోటో మాత్రమే ముద్రిస్తున్నారు. ఇప్పుడు ప్రజలు మహాత్మా గాంధీ ఫోటోతో పాటు ఠాగూర్, కలాం నోట్లను చూడవచ్చని తెలుస్తోంది. ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక నివేదిక ప్రకారం.. ఇది త్వరలోనే జరగవచ్చు. ఆర్థిక మంత్రిత్వ శాఖ, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కరెన్సీ నోట్లపై కలాం, ఠాగూర్ వాటర్‌మార్క్‌లను ఉపయోగించడాన్ని పరిశీలిస్తున్నట్లు నివేదిక చెబుతోంది. గతంలో దొంగ నోట్లను అరికట్టేందుకు నోట్ల రద్దు ప్రకటించిన తరువాత, దేశ కరెన్సీ నోట్ల విషయంలో మోదీ సర్కార్ మరో సారి కీలక నిర్ణయం వైపు అడుగులు వేస్తున్నట్లు జీని ప్రకారం తెలుస్తోంది.
దేశంలో, ప్రపంచంలో ప్రజలు రవీంద్రనాథ్ ఠాగూర్ పేరును గౌరవంగా తీసుకుంటారు. కానీ బెంగాల్‌లో ఆయనకు ప్రత్యేక హోదా ఉంది. బెంగాల్‌లోని పెద్ద సంఖ్యలో ఇళ్లలో రవీంద్రనాథ్ ఠాగూర్ చిత్రాన్ని మనం చూడవచ్చు. అదే సమయంలో.. భారత 11వ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ డాక్టర్ APJ అబ్దుల్ కలాం దేశంలోని గొప్ప వ్యక్తులలో ఒకరు. నోట్లపై మహాత్మా గాంధీ కాకుండా ఇతర ప్రముఖుల ఫోటోగ్రాఫ్‌లను ఉపయోగించడాన్ని ఆర్‌బిఐ పరిగణనలోకి తీసుకోవడం ఇదే మొదటిసారని తెలుస్తోంది. ఇప్పటికే ఇలా ప్రముఖుల చిత్రాలను కరెన్సీ నోట్లపై అమెరికా ముద్రిస్తున్న విధాన్ని ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా అనుకరిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఇలా ఎందుకు జరుగుతోందని మీరు ఆలోచిస్తున్నట్లయితే.. కరెన్సీ నోట్లపై బహుళ అంకెల వాటర్‌మార్క్‌లను చేర్చే అవకాశాలను అన్వేషించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. US డాలర్లలో జార్జ్ వాషింగ్టన్, బెంజమిన్ ఫ్రాంక్లిన్, థామస్ జెఫెర్సన్, ఆండ్రూ జాక్సన్, అలెగ్జాండర్ హామిల్టన్, అబ్రహం లింకన్‌లతో సహా 19వ శతాబ్దపు అధ్యక్షుల చిత్రాలను వివిధ డినామినేషన్లలో కలిగి ఉన్నాయి. RBI, సెక్యూరిటీ ప్రింటింగ్, మిటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SPMCIL).. గాంధీ, ఠాగూర్, కలాం వాటర్‌మార్క్‌ల రెండు వేర్వేరు సెట్ల నమూనాలను IIT-ఢిల్లీకి చెందిన ప్రముఖ ప్రొఫెసర్ దిలీప్ T. షహానీకి పంపాయి. సాహ్నీని రెండు సెట్ల నుంచి ఎంచుకుని, వాటిని ప్రభుత్వం తుది పరిశీలనకు ఉంచాలని కోరింది. వాటర్‌మార్క్‌లను పరిశోధించే ప్రొఫెసర్ షహానీ, విద్యుదయస్కాంత పరికరాల్లో నైపుణ్యం కలిగి ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో మోదీ ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డును కూడా ప్రదానం చేసింది.