HCL Benz Cars: సాధారణంగా ఏ సంస్థ అయినా తమ ఉద్యోగాల క్షేమాన్ని భావిస్తుంది. ఊహించిన దాని కంటే ఎక్కువగా ఆదాయం వస్తే దానికి కారణమైన ఉద్యోగులకు లాభాలను పంచుతుంటాయి. ఉద్యోగుల పనితీరుకు గుర్తింపుగా బోనాస్ అందిస్తూ ప్రోత్సహిస్తుంటాయి. అయితే ఈ బోనస్ మహా అయితే రెండు నెలలు లేదా మూడు నెలల కంటే మించదు. కానీ ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మాత్రం తమ ఉద్యోగులకు అదిరిపోయే వార్తను చెప్పనుందని సమాచారం. కంపెనీలో మంచి ప్రతిభను కనబరిచిన వారికి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమైందని తెలుస్తోంది.
తమ కంపెనీకి లాభాలు రావడంలో కీలక పాత్ర పోషించిన కొంతమంది టాప్ పర్ఫామర్లకు ఏకంగా మెర్సిడెస్ బెంజ్ కార్లను బహుమతిగా ఇవ్వాలని ప్రతిపాదించింది. హెచ్‌సీఎల్ చేసిన ఈ ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలపాల్సి ఉంది. ఈ విషయమై హెచ్‌సీఎల్ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ అప్పారావు మాట్లాడుతూ.. ‘రీప్లేస్‌మెంట్ హైరింగ్ కాస్ట్ 15 నుంచి 20 శాతం ఎక్కువ ఉండడంతో తమ ఉద్యోగుల్లో నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. జావా డెవలపర్‌ను ప్రస్తుతం ఇచ్చే ప్యాకేజ్‌లో కంపెనీలోకి తీసుకోవచ్చు. కానీ కానీ క్లౌడ్ ప్రోఫెషనల్స్‌ను మాత్రం అదే వేతనంతో తీసుకోలేమని ఆయన అభిప్రాయపడ్డారు. హెచ్‌సీఎల్ ప్రతి సంవత్సరం ఉద్యోగుల జీతంలో 50 నుంచి 100 శాతం వరకు క్యాష్ ఇన్సెంటివ్ స్కీమ్‌ను అందిస్తున్నామని అప్పారావు తెలిపారు. తాము కొత్తగా ప్రాతిపాదించిన విధానంతో కంపెనీలో సుమారు 10 శాతం మందికి ప్రయోజనం కలగనుందన్నారు.
Also Read: Hyundai: హ్యుందాయ్ మొదటి 7 సీట్ల ఎస్‌యూవీ ‘అల్కాజార్’కు భారీ స్పందన.. నెలరోజుల్లో 11 వేల బుకింగ్స్!
Personal Loan: అప్పులు పెరిగిపోతే ఈ పద్ధతిని అనుసరించండి.. మొత్తం రుణం తక్కువ EMIలో చెల్లించండి..