Smart Grocery: ఇక సూపర్‌ మార్కెట్లో బిల్లు కోసం లైన్‌లో నిలబడాల్సిన అవసరం లేదు.. కొత్త టెక్నాలజీ రాబోతోంది!

|

Jul 13, 2024 | 8:30 AM

భారత మార్కెట్లో సూపర్ మార్కెట్ల సంస్కృతి వేగంగా పెరుగుతోంది. మెట్రో నగరాల తర్వాత చిన్న నగరాల్లో కూడా సూపర్ మార్కెట్లు ప్రారంభమయ్యాయి. చాలా మంది వ్యక్తులు సూపర్ మార్కెట్లలో షాపింగ్ చేస్తారు. ఎందుకంటే చాలా వస్తువులు చాలా తక్కువ ధరలకు లభిస్తాయి. కానీ ఒక సూపర్ మార్కెట్‌లో ఒక సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. దీని కారణంగా ప్రజలు తరచుగా అడ్డదారులు తొక్కాల్సి వస్తుంది. నిజానికి సూపర్‌మార్కెట్లలో పీక్..

Smart Grocery: ఇక సూపర్‌ మార్కెట్లో బిల్లు కోసం లైన్‌లో నిలబడాల్సిన అవసరం లేదు.. కొత్త టెక్నాలజీ రాబోతోంది!
Ai Technology
Follow us on

భారత మార్కెట్లో సూపర్ మార్కెట్ల సంస్కృతి వేగంగా పెరుగుతోంది. మెట్రో నగరాల తర్వాత చిన్న నగరాల్లో కూడా సూపర్ మార్కెట్లు ప్రారంభమయ్యాయి. చాలా మంది వ్యక్తులు సూపర్ మార్కెట్లలో షాపింగ్ చేస్తారు. ఎందుకంటే చాలా వస్తువులు చాలా తక్కువ ధరలకు లభిస్తాయి. కానీ ఒక సూపర్ మార్కెట్‌లో ఒక సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. దీని కారణంగా ప్రజలు తరచుగా అడ్డదారులు తొక్కాల్సి వస్తుంది. నిజానికి సూపర్‌మార్కెట్లలో పీక్ టైమ్‌లో బిల్‌ కౌంటర్‌ వద్ద క్యూ కట్టడం వల్ల షాపింగ్‌కు వచ్చేవారు ఎక్కువ సమయం వృధా చేసుకుంటున్నారు. కానీ త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభించనుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు సూపర్ మార్కెట్లలో AI కార్ట్‌లను కనుగొంటారు.

ఇది కూడా చదవండి: Bike Ride: బైక్‌లో ఈ భాగం ఎందుకంత ముఖ్యం.. దీని పనితీరు, ఉపయోగం ఏంటి?

AI కార్ట్ అంటే ఏమిటి?

ఇవి కూడా చదవండి

ఇప్పటి వరకు, వినియోగదారులు సూపర్ మార్కెట్లలో వస్తువులను ఉంచడానికి సాధారణ ట్రాలి వంటి దాన్ని వాడుతుంటారు. ఇందులో సరుకులు ఉంచిన తర్వాత బిల్లు కౌంటర్‌ వద్దకు వెళ్లి బిల్లు తెచ్చుకోవాలి. అయితే ఇటీవల అమెరికాలోని న్యూయార్క్‌లోని ఓ సూపర్‌మార్కెట్‌లో AI కార్ట్‌ని వాడారు. ఆ తర్వాత కస్టమర్ బిల్లు కౌంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు.

AI కార్ట్ ఎలా పని చేస్తుంది?

మీరు న్యూయార్క్ సూపర్ మార్కెట్‌లో ఉపయోగిస్తున్న AI కార్ట్‌లో ఏదైనా వస్తువును ఉంచిన వెంటనే, దాని మొత్తం కార్ట్‌లోని డిస్‌ప్లేలో కనిపించడం ప్రారంభమవుతుంది. దీని తర్వాత మీరు కొనుగోలు చేసిన ప్రతి వస్తువు మొత్తం దానికి జోడిస్తుంది.

AI కార్ట్‌లో రివార్డ్ పాయింట్‌లు:

ఇది ‘గేమిఫికేషన్’ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. ఇది కొంత మొత్తాన్ని ఖర్చు చేస్తే రివార్డ్‌లను ఇస్తుంది. ఈ స్మార్ట్ కార్ట్ అమెరికాలోని అనేక సూపర్ మార్కెట్లలో విజయవంతంగా పరీక్షించారు. కస్టమర్లు కూడా దీన్ని ఇష్టపడుతున్నారు. త్వరలో ఈ ఏఐ ట్రాలీ బండి భారత్‌లో కూడా దూసుకుపోనుంది.

ఇది కూడా చదవండి: Budget 2024: ఎక్కువ సార్లు బడ్జెట్‌ను సమర్పించి మంత్రి ఎవరు? నిర్మలా సీతారామన్ ఆ రికార్డును బ్రేక్ చేస్తారా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి