
Silver Prices: వెండి ధరల పతనం ఆగే సూచనలు కనిపించడం లేదు. గత వారం నిలకడగా తగ్గిన తర్వాత వారంలోని మొదటి ట్రేడింగ్ రోజైన సోమవారం నాడు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఈ రెండు విలువైన లోహాల ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. వెండి ఫ్యూచర్స్ ధరలు అకస్మాత్తుగా రూ.5,000 కంటే ఎక్కువ పడిపోయి, కిలోకు రూ.2.17 లక్షలకు చేరాయి. జూలై మొదటి 13 రోజుల్లో వెండి ధర రూ.13,000 కంటే ఎక్కువగా తగ్గిపోయింది.
అలాగే మే 14వ తేదీన కిలో వెండి ధర 3 లక్షల రూపాయల వరకు ఉంది. అదే ఈ రోజు అంటే జూలై 14న 2.35 లక్షల రూపాయల వద్ద ట్రేడవుతోంది. అంటే ఈ రెండు నెలల్లో 65 వేల రూపాయల వరకు తగ్గుముఖం పట్టింది
ఇదిలా ఉంటే గోల్డ్, సిల్వర్ ధరలు పెరగడానికి మరో ప్రధాన కారణం ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం ప్రారంభం అవడమే అని నిపుణులు చెబుతున్నారు. హార్మోజ్ జలసంధిని ఇరాన్ మూసి వేయడంతో మళ్ళీ ఉద్రిక్తమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వెండి ధర భారీగా పెరుగుతున్న నేపథ్యంలో సిల్వర్ లో పెట్టుబడి పెట్టే వారికి ఫిజికల్ సిల్వర్ బదులుగా సిల్వర్ ఏటీఎం పథకాలు చాలా అనుకూలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. సిల్వర్ ఈటీఎఫ్ అనేది స్టాక్ మార్కెట్ తరహాలోనే పనిచేస్తుంది. సిల్వర్ యూనిట్ల రూపంలో కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
సిల్వర్ ధరలు తగ్గడానికి మరో ప్రధాన కారణం ప్రపంచ వ్యాప్తంగా సిల్వర్ కు సంబంధించిన డిమాండ్ కూడా తగ్గడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. సాధారణంగా సిల్వర్ ధరలు బంగారంతో అనుగుణంగా కొనసాగుతుంటాయి ఎందుకంటే బంగారం పైన ఎలాగైతే సేఫ్ ఇన్వెస్ట్మెంట్ భావనతో ఇన్వెస్టర్లు పెట్టుబడి పెడుతున్నారో, ప్రస్తుతం సిల్వర్ పైన కూడా అదే స్థాయిలో ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టడం గమనించవచ్చు.
సిల్వర్ ధరలు మార్కెట్లో తగ్గుతున్న నేపథ్యంలో సిల్వర్ ఆభరణాలు కొనుగోలు చేసే వారికి మాత్రం ఇది ఒక రకంగా ఊరటగా చెప్పవచ్చు. ముఖ్యంగా శుభకార్యాలకు ఉపయోగించే వెండి సామాన్లు కొనుగోలు చేసే వారికి తగ్గిన ధరలు భారీ ఊరటనిస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి