Silver Price Today: మనదేశంలో బంగారం, వెండికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏ వ్యాపారం తగ్గినా.. గోల్డ్, సిల్వర్ వ్యాపారం మాత్రం జోరుగా కొనసాగుతూనే ఉంటుంది. ధరలు పెరిగినా.. కొనుగోళ్లు ఏ మాత్రం ఆగవు. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో ఇక చెప్పనవసరం లేదు. రికార్డు బిజినెస్ జరుగుతుంటుంది. వెండితో తయారు చేసిన విగ్రహాలు, ఇతర పాత్రలు, దేవుడికి సంబంధించిన పాత్రలను అధికంగా కొనుగోలు చేస్తుంటారు మహిళలు. ఇక తాజాగా బుధవారం (నవంబర్ 10)న బంగారం ధర స్వల్పంగా తగ్గితే.. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. వివిధ కారణాల వల్ల దేశంలో బంగారం, వెండి ధరల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వెండి ధరలు ఒక చోట పెరిగితే .. మరో చోటు తగ్గుతుంది. లేదంటే స్థిరంగా కొనసాగుతుంది. దేశీయంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర 64,800 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబై లో64,800 ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.69,100 ఉండగా, కోల్‌కతాలో రూ.64,800 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.69,100 ఉండగా, విజయవాడలో రూ.69,100 ఉంది. ఇక కేరళలో కిలో వెండి ధర రూ.69,100 ఉండగా, మధురైలే రూ.69,100 వద్ద కొనసాగుతోంది.
కాగా, ప్రధాన నగరాల్లో ఉన్న జ్యూయలర్స్, వెబ్‌సైట్ల ఆధారంగా వెండి ధరలు ఉంటాయి. ఎప్పటికప్పుడు ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. కొనుగోలు చేసే ముందు ఆ సమయానికి ధర ఎంత ఉందో తెలుసుకొని వెళ్లడం మంచిది. ఇక బంగారం, వెండి ధరల్లో మార్పులు ఉండడానికి అనేక కారణాలున్నాయి. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో ధరలు హెచ్చు తగ్గులు కావడానికి కూడా అనేక అంతర్జాతీయ పరమైన కారణాలు ఉంటాయి.
ఇవి కూడా చదవండి: