గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. తాజాగా ఈరోజు నేలచూపులు చూశాయి. అయితే నిన్న పసిడి ధారిలోనే వెండి ధరలు కూడా దిగొచ్చాయి. తాజాగా ఈరోజు (ఆగస్ట్ 5న) వెండి ధరలు పెరిగాయి. దేశీయ మార్కెట్లో ఇవాళ ఉదయం 10 గ్రామల వెండి దర రూ. 680 ఉండగా.. కేజీ సిల్వర్ రేట్ రూ. 68,000 చేరింది.
అలాగే హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల వెండి రూ. 731 ఉండగా.. కేజీ సిల్వర్ రూ. 73,100కు చేరింది. అలాగే దేశీయ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల ధర రూ. 680 ఉంది. ఇక కేజీ సిల్వర్ రూ. 68,000కు చేరింది. మరోవైపు దేశీయ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల ధర రూ. 680 ఉండగా.. కిలో వెండి ధర రూ. 68,000లకు చేరింది. విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో వెండి ధరలలో ఎలాంటి మార్పులు జరగలేదు. 10 గ్రాముల వెండి రూ. 731 ఉండగా.. కేజీ సిల్వర్ రూ. 73,100కు చేరింది. ఇక చెన్నై మార్కెట్లో 10 గ్రాముల ధర రూ.731కు చేరింది. అలాగే కేజీ సిల్వర్ ధర రూ. 73,100కు చేరింది.
ఇక హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 44,900 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 48,980కు చేరింది. అలాగే విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,900 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 48,980కు చేరింది. ఇక దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 47,950 ఉండగా.. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 46,950కు చేరింది.
Also Read: Horoscope: ఈరోజు ఈ రాశుల వారికి ఉద్యోగాలు, వ్యాపారాలలో అనుకూలం.. రాశిఫలాలు..
Pulichintala: పులిచింతల ప్రాజెక్టులో సాంకేతికలోపం.. విరిగిపడ్డ గేటు.. లక్ష క్యూసెక్కుల నీరు వృధా..!
Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. దిగొచ్చిన బంగారం ధరలు.. ఎంత తగ్గిందో తెలుసా..