Silver Price Today: స్వల్పంగా పెరిగిన వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్ల వివరాలు..

|

Jun 23, 2021 | 5:32 AM

Silver rate Today: దేశంలో కరోనా విజృంభిస్తున్నప్పటికీ.. బంగారం, వెండి ధరలకు మాత్రం బ్రేక్ పడటం లేదు. అయితే.. నిత్యం బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం

Silver Price Today: స్వల్పంగా పెరిగిన వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్ల వివరాలు..
Silver Price
Follow us on

Silver rate Today: దేశంలో కరోనా విజృంభిస్తున్నప్పటికీ.. బంగారం, వెండి ధరలకు మాత్రం బ్రేక్ పడటం లేదు. అయితే.. నిత్యం బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం చోటుచేసుకుంటోంది. ఒకరోజు ధర తగ్గితే.. మరోరోజు పెరుగుతోంది. ప్రపంచంలో అదేవిధంగా దేశంలో చోటు చేసుకుంటున్న పలు పరిణామాల వల్ల బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. కాగా గతవారం నుంచి తగ్గుతూ వచ్చిన వెండి ధరలు.. బుధవారం స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.200 మేర పెరిగి 67,800 రూపాయలకు చేరుకుంది. కాగా.. తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం..

ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

• హైదరాబాద్‌లో వెండి కిలో రూ.73,000 లు ఉంది.
• విజయవాడలో వెండి రూ.73,000లు వద్ద కొనసాగుతోంది.
• దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 67,800 గా ఉంది.
• ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 67,800 గా ఉంది.
• కర్ణాటక రాజధాని బెంగళూరులో రూ.67,800 వద్ద కొనసాగుతోంది.
• కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.67,800 వద్ద ఉంది.
• తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ.73,000 వద్ద కొనసాగుతోంది.
కాగా.. దక్షిణాది రాష్ట్రాల్లోనే వెండి ధరలు ఎక్కువ రేటుతో కొనసాగుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
• హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,100 ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.48,110 వద్ద కొనసాగుతోంది.
• విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,100 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.48,110 వద్ద కొనసాగుతోంది.
• విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,100 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 48,110 వద్ద కొనసాగుతోంది.

Also Read;

200మంది బీజేపీ కార్యకర్తలు మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ లో చేరిక… తప్పు చేశామంటూ…