
Silver Price Today: గత కొన్ని రోజులుగా వెండి ధరలు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. ముఖ్యంగా గడిచిన మూడు రోజుల్లో వెండి ధరల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే బుధవారం దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో వెండి ధరల్లో విభిన్నత కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు స్థిరంగా కొనసాగగా.. నార్త్ ఇండియాలో మాత్రం భారీగా పెరిగాయి. మరి బుధవారం దేశంలోని పలు నగరాల్లో కిలో వెండి ధర ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
* న్యూఢిల్లీలో కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగి రూ. 61,500గా ఉంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కిలో వెండిపై ఏకంగా రూ. 300 పెరిగింది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 61,500గా నమోదైంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. ఇక్కడ కిలో వెండి ధర రూ. 65,300గా ఉంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో కూడా కిలో వెండిపై రూ. 100 పెరిగి రూ. 61,500గా నమోదైంది.
* హైదరాబాద్‌లో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ కిలో వెండి రూ. 65,300గా ఉంది.
* విజయవాడలో కిలో వెండి ధర రూ. 65,300వద్ద కొనసాగుతోంది.
* సాగర నగరం విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 65,300గా ఉంది.
Also Read: Viral News : మట్టిలో మాణిక్యానికి ఉదాహరణ !! యువకుడి టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా !! వీడియో
Dry Ginger Benefits: ఎండిన అల్లంతో అనేక ప్రయోజనాలు.. ఈ సమస్యలు ఉన్నవారు మాత్రం అస్సలు తినొద్దు..