Silver Price: రికార్డ్‌ స్థాయిలో సిల్వర్‌ ధర.. ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్‌ బ్లాంకే..!

దేశంలో బంగారం, వెండి ధరలకు రెక్కలొస్తున్నాయి. రికార్డు స్థాయిలో పరుగులు పెడుతున్నాయి. జనవరి 20న సిల్వర్ పై భారీగా పెరిగింది. వెండి ధరల పెరుగుదల తగ్గే సూచనలు కనిపించడం లేదు. 3 లక్షల మార్కును తాకిన తర్వాత కూడా వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి..

Silver Price: రికార్డ్‌ స్థాయిలో సిల్వర్‌ ధర.. ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్‌ బ్లాంకే..!
Silver Price

Updated on: Jan 20, 2026 | 5:38 PM

Silver Price: వెండి ధరల పెరుగుదల తగ్గే సూచనలు కనిపించడం లేదు. 3 లక్షల మార్కును తాకిన తర్వాత కూడా వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం MCX ఎక్స్ఛేంజ్‌లో వెండి ధరలు 2.48 శాతం లేదా 7,701 రూపాయలు పెరిగి కిలోగ్రాముకు 3,17,976 రూపాయల వద్ద ట్రేడవుతున్నాయి. ఇంతలో, కామెక్స్‌లో వెండి దాదాపు 6 శాతం పెరిగి ఔన్సుకు $94.74 కు చేరుకుంది.

జనవరి 20న సాయంత్రం సమయానికి కిలో వెండిపై రెండో దఫా మరో రూ.10 వేలు పెరిగింది. మొత్తం ఈ రోజు రూ.22,000 వరకు ఎగబాకింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.3,40,000 వద్ద కొనసాగుతోంది. అయితే బంగారం రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. తులం బంగారంపై ఏకంగా 2130 వరకు పెరిగి ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,370 వద్ద ట్రేడవుతోంది. అంటే తులం కొనుగోలు చేయాలంటే రూ. లక్షా 50 వేలు పెట్టుకోవాల్సిందే.

ఇది కూడా చదవండి: కేవలం రూ.1 లక్ష పెట్టుబడి 52 లక్షలుగా మారింది.. అదృష్టం అంటే ఇదేనేమో..!

ఇవి కూడా చదవండి

వెండి ఎందుకు పెరిగింది?

డిమాండ్ పెరగడం, బలహీనమైన US డాలర్ కారణంగా వెండి ధరలు పెరిగాయి. నాటో మిత్రదేశమైన డెన్మార్క్ నుండి గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయడానికి ట్రంప్ ప్రయత్నాలను వేగవంతం చేయడంతో డాలర్ విలువ తగ్గుతోంది. ఇప్పుడు, యూరోపియన్ యూనియన్ కూడా ప్రతీకార చర్యలను పరిశీలిస్తోంది. ఇది భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను గణనీయంగా పెంచుతుంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, నాటో మిత్రదేశాల పట్ల అమెరికా మరింత దూకుడుగా వ్యవహరించడం ఆర్థిక మార్కెట్లను కుదిపేసింది. సురక్షితమైన పెట్టుబడులకు డిమాండ్‌ను పెంచింది.

Success Story: ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి కేవలం రూ.3 వేల పెట్టుబడితో వ్యాపారం.. నేడు రూ.6 లక్షల సంపాదన

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి