అక్షయ తృతీయ అంటే వైశాఖ మాసంలో చేసే హిందువుల ప్రధాన పండుగ. ముఖ్యంగా అక్షయ తృతీయ పూజల తర్వాత ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేసుకుంటే మంచిదని భావిస్తారు. ఈ రోజు కనీసం గ్రాము బంగారమైన కొనాలనుకునే చాలా ఎక్కువ మందే ఉంటార. ఈ ఏడాది ఏప్రిల్ 22న అక్షయ తృతియ వచ్చింది. ముఖ్యంగా దీపావళి, ధంతేరస్ తర్వాత అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేయడం శుభప్రదంగా హిందువులు పరిగణిస్తారు. సాధారణంగా భారతీయులు బంగారం కొనడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఇది పొదుపు విలువను పెంచడమే కాకుండా ఆభరాణాలుగా కూడా పని చేస్తాయని ఎక్కువ బంగారం కొనుగోలుకు మక్కువ చూపుతారు. అయితే భౌతిక బంగారాన్ని ఆభరణాలుగా ధరించాలనుకునే వ్యక్తులు కాకుండా కష్ట సమయాల్లో దానిని ఉపయోగించుకునేలా పెట్టుబడి పెట్టేవారికి డిజిటల్ బంగారం ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ఇందులో పెట్టుబడి పెడితే పెట్టుబడిదారులకు తరుగు, మూజూరి ఖర్చుల మిగులుతాయి. ఎప్పుడకావాలంటే అప్పుడు సులభంగా దీన్ని విక్రయించుకోవచ్చు.
డిజిటల్ బంగారం అనేది భౌతికంగా బంగారాన్ని ప్రత్యామ్నాయం. ఇందులో పెట్టుబడి పెట్టడం అనే వర్చువల్ టెక్నిక్ అని నిపుణులు చెబుతున్నారు. ఈ బంగారం ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ బంగారం కనీస కొనుగోలు లేదా అమ్మకం ధర ఒక రూపాయి. డిజిటల్ బంగారానికి నిర్దిష్ట ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని భద్రపరచడం, ప్రత్యేకంగా నిల్వ అవసరం లేదు, ఎప్పుడైనా భౌతిక రూపంలో రీడీమ్ చేయవచ్చు. ముఖ్యంగా పేటీఎం, గూగుల్ ప్లే వంటి యాప్స్‌లో కొనుగోలుకు ఈ బంగారం కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి