Facebook: ఫేక్‌బుక్‌కు ఎదురు దెబ్బ.. సీఓఓ పదవికి రాజీనామా చేసిన షెరిల్‌ శాండ్‌బర్గ్‌..

|

Jun 03, 2022 | 7:35 AM

ఫేస్‌బుక్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ సంస్థ నుంచి ఒక ప్రముఖ అధికారిణి తప్పుకోనున్నారు. ఫేస్‌బుక్‌ వ్యాపారాన్ని అంకుర స్థాయి నుంచి డిజిటల్‌ వ్యాపార ప్రకటనల సామ్రాజ్యంగా విస్తరించడంలో ఎంతో కృషి చేసిన చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌(సీఓఓ) షెరిల్‌ శాండ్‌బర్గ్‌ కంపెనీకి రాజీనామా చేయనున్నారు...

Facebook: ఫేక్‌బుక్‌కు ఎదురు దెబ్బ.. సీఓఓ పదవికి రాజీనామా చేసిన షెరిల్‌ శాండ్‌బర్గ్‌..
Follow us on

ఫేస్‌బుక్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ సంస్థ నుంచి ఒక ప్రముఖ అధికారిణి తప్పుకోనున్నారు. ఫేస్‌బుక్‌ వ్యాపారాన్ని అంకుర స్థాయి నుంచి డిజిటల్‌ వ్యాపార ప్రకటనల సామ్రాజ్యంగా విస్తరించడంలో ఎంతో కృషి చేసిన చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌(సీఓఓ) షెరిల్‌ శాండ్‌బర్గ్‌ కంపెనీకి రాజీనామా చేయనున్నారు. గూగుల్‌ నుంచి వచ్చిన షెరిల్‌, లిస్టింగ్‌కు నాలుగేళ్ల ముందు అంటే 2008లో ఫేస్‌బుక్‌లో జాయిన్‌ అయ్యారు. ‘ఉద్యోగంలో చేరిన సమయంలో అయిదేళ్ల పాటు ఉంటానని భావించా కానీ 14 ఏళ్లు గడిచాయని. నా జీవితంలో తదుపరి అధ్యాయం రాయడానికి ఇదే సమయమని భావిస్తున్నా’నని తన ఫేస్‌బుక్‌ పేజీలో వివరించారు.

కంపెనీలో సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ తర్వాతి స్థానం ఈమెదే అవ్వడం గమనార్హం. సాంకేతిక పరిశ్రమలో అత్యంత ప్రఖ్యాతిఖాంచిన మహిళా ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరిగా నిలిచిన షెరిల్‌.. అటు మహిళలకు కానీ, ఇటు ఫేస్‌బుక్‌ ఉత్పత్తుల వల్ల ఇబ్బందులు పడ్డవారి విషయంలో కానీ సరిగ్గా స్పందించలేదని విమర్శల పాలయ్యారు. రాజీనామా నిర్ణయానికి కారణం ఏమిటనేది జుకర్‌బర్గ్‌ కానీ శాండ్‌బర్గ్‌ తెలపలేదు. ప్రస్తుతం మెటా(ఫేస్‌బుక్‌ మాతృసంస్థ)కు చెందిన 4 ముఖ్య యాప్‌ల(ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా, వాట్సప్‌, మెసెంజర్‌) కీలక కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న జేవియర్‌ ఒలివన్‌ కొత్త సీఓఓగా బాధ్యతలు తీసుకోనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి