
Banking Fraud: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకోకుండా సామాన్యులను కాపాడాల్సిన బ్యాంక్ అధికారులే వారితో చేతులు కలిపి మోసాలకు పాల్పడుతున్న ఉదంతం హైదరాబాద్‌లో కలకలం రేపింది. సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న ఏడుగురు బ్యాంక్ అధికారులను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం (ఏప్రిల్ 30) విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పోలీసులు ఈ వివరాలను వెల్లడించారు.
నిందితులుగా తేలిన ఈ బ్యాంక్ అధికారులు కేవైసీ (KYC) నిబంధనలను బేఖాతరు చేస్తూ, ఎటువంటి భౌతిక తనిఖీలు లేకుండానే సైబర్ నేరగాళ్ల పేరిట బ్యాంకు ఖాతాలను తెరిచారు. ఐదు వేర్వేరు కేసుల్లో వీరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్నా, అధికారులకు సమాచారం ఇవ్వకుండా నేరగాళ్లకు పరోక్షంగా, ప్రత్యక్షంగా మద్దతు పలికారు.
నేరగాళ్లు దోచుకున్న సొమ్మును దాచుకోవడానికి, ఇతర ఖాతాలకు మళ్లించడానికి ఈ బ్యాంక్ అధికారులు విచ్చలవిడిగా ఖాతాలను సృష్టించారు. తమ అధికారిక హోదాను దుర్వినియోగం చేస్తూ, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారు. ఈ ముఠాల కారణంగా ఎంతో మంది అమాయకులు తమ కష్టార్జితాన్ని కోల్పోయారు. నిబంధనల ప్రకారం అనుమానాస్పద లావాదేవీలను నివేదించాల్సిన బాధ్యతను వీరు పూర్తిగా విస్మరించారు.
బ్యాంక్ ఖాతాల విషయంలో, సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఏదైనా అనుమానాస్పద కాల్స్ లేదా లింక్స్ వస్తే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు.
ఇది కూడా చదవండి: New Rules: ఎల్‌పిజి డెలివరీ నుండి ఆన్‌లైన్ గేమింగ్ వరకు.. మే 1 నుంచి మారిన కొత్త నిబంధనలు ఇవే..!
ఇది కూడా చదవండి: Gold Price Today: మగువలకు తీపి కబురు.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి