UPI Payments: యూపీఐలో వేరే వ్యక్తికి పొరపాటుగా డబ్బులు పంపారా..? ఈ ఒక్క పని చేస్తే డబ్బులు తిరిగి వెనక్కి..

మీరు ఒక నెంబర్‌కు పంపబోయి మరో నెంబర్‌కు పోరపాటుగా డబ్బులు పంపారా.. ? ఇలాంటి సమయంలో ఏం చేయాలనేది చాలామందికి తోచదు. ఎవరికి ఫిర్యాదు చేయాలి.. డబ్బులు ఎలా తిరిగి రాబట్టుకోవాలనేది తెలియక సతమతమవుతూ ఉంటారు. అయితే ఇలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

UPI Payments: యూపీఐలో వేరే వ్యక్తికి పొరపాటుగా డబ్బులు పంపారా..? ఈ ఒక్క పని చేస్తే డబ్బులు తిరిగి వెనక్కి..
New Upi Rule

Updated on: Apr 11, 2026 | 11:24 AM

స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతీఒక్కరి ఫోన్లలో తప్పనిసరిగా ఏదొక యూపీఐ యాప్ ఉంటుంది. కొందరి ఫోన్లలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ యాప్స్ ఉంటాయి. యూపీఐ సౌకర్యం అందుబాటులోకి వచ్చాక పర్సులో డబ్బులు ఉంచుకోవడం చాలామంది మానేశారు. ఎక్కడికక్కడ స్కానర్లు అందుబాటులో ఉండటంతో.. ఫోన్ ద్వారానే సులువుగా పేమెంట్స్ చేసేస్తున్నారు. అయితే కొన్నిసార్లు యూపీఐ ఐడీ తప్పుగా ఉండటం, టైపింగ్‌లో పొరపాట్లు, ఒక కాంటాక్ట్స్ బదులు మరో నెంబర్‌ను ఎంచుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో డబ్బులు వేరేవారికి బదిలీ అయిన సమయంలో తిరిగి రాబట్టుకోవాలంటే ఏం చేయాలో చూద్దాం.

ముందుగా ఆ పని చేయండి

మీరు వేరే వ్యక్తికి పొరపాటుగా డబ్బులు పంపినప్పుడు రిసీవర్‌ను కాంటాక్ట్ అవ్వండి. డబ్బులు తిరిగి ఇచ్చేయాల్సిందిగా కోరండి. అనుకోకుండా డబ్బులు పంపినట్లు తెలపండి. చాలామంది తిరిగి డబ్బులు ఇచ్చేస్తారు. ఒకవేళ డబ్బుులు తిరిగి ఇవ్వడానికి రిసీవర్ నిరాకరిస్తే మీరు తదుపరి చర్యలు తీసుకోండి. తరుపరి చర్యగా మీ బ్యాంక్ ప్రతినిధులను సంప్రదించండి. వెంటనే బ్యాంకు సిబ్బందికి ఫిర్యాదు చేయండి. యూపీఐ యాప్‌లోనే తప్పుడు ట్రాన్సక్షన్లపై ఫిర్యాదు చేసే ఆప్షన్ ఉంటుంది. దాని ద్వారా యూపీఐ యాప్‌లో రిపోర్ట్ చేయండి

ఈ పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి

ఇక మీరు భీమ్ యాప్ లేదా ఎన్‌పీసీఐ పోర్టల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఆ తర్వాత బ్యాంకు పై అధికారులు సంప్రదించి ఫిర్యాదు చేయండి. ప్రతీ బ్యాంకులో ఒక ఫిర్యాదుల విభాగం ఉంటుంది. నోడల్ అధికారి లేదా సీనియర్ల బృందం దీనిని నిర్వహిస్తూ ఉంటుంది. వారికి ఫిర్యాదు చేస్తే మీకు సహాయపడే అవకాశం ఉంటుంది. ఇక అవసరమైతే మీరు ఇంటిగ్రేటెడ్ ఓంబుడ్స్‌మన్ స్కీమ్ కింద ఆర్బీఐ ఓంబుడ్స్‌మెన్‌కు ఫిర్యాదు చేయవచ్చు.

పంపేటప్పుడు చెక్ చేసుకోండి

మీరు ఇన్ని ఫిర్యాదులు చేసినా డబ్బులు తిరిగి వస్తాయనే గ్యారంటీ లేదు. ట్రాన్సాక్షన్‌లో ఎలాంటి మోసం, సిస్టమ్ లోపం లేకపోతే బ్యాంక్ లావాదేవీని రద్దు చేసే అవకాశం ఉండదు. దీని రిసీవర్ డబ్బులు తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తే ఏం చేయడం కుదరదు. అందుకే యూపీఐ లావాదేవీలు చేసేటప్పుడు ఒక 10 సెకన్లను ఆగి చెక్ చేసుకోండి. కరెక్ట్ నెంబర్‌కు పంపుతున్నామా.. లేదా అనేది చూసుకోండి. హడావుడిగా పంపడం వల్ల పొరపాటు జరిగే అవకాశం ఉంటుంది. ఒకసారి డబ్బులు పొగోట్టుకున్న తర్వాత బాధపడే బదులు నిధులు బదిలీ చేసేముందు ధృవీకరించుకోడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీరు సేఫ్‌గా ఉంటారు.

Follow Us