దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. దేశంలో కరోనా విజృంభణ తీవ్రరూపం దాలుస్తుండటంతో స్టాక్ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని గురవుతున్నాయి. ఇదే క్రమంలో సూచీలు ఇవాళ సెషన్‌ను భారీ నష్టాలతో మొదలయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ – సెన్సెక్ 360 పాయింట్లకుపైగా నష్టంతో 47,338 వద్ద, ఎన్ఎస్ఈ- నిఫ్టీ దాదాపు 90 పాయింట్లు కోల్పోయి 14,208 వద్ద ట్రేడయ్యాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ షేర్లు ఎక్కువగా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. అయితే, కొంత ఊరటనిచ్చే అంశం ఏమంటే.. ఫార్మా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. డాక్టర్ రెడ్డీస్, సన్‌ఫార్మా, ఓఎన్జీసీ, పవర్‌గ్రిడ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌యూఎల్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 47,551.08, నిఫ్టీ 14,265.25 వద్ద ట్రేడవుతున్నాయి.
Read Also…
India Corona Cases: దేశంలో కరోనా విలయతాండవం.. ప్రపంచంలోనే రికార్డు స్థాయిలో కేసులు.. మరణాలు..