Stock Market: కుప్పకూలిన స్టాక్ మార్కెట్ సూచీలు.. భారీ పతనానికి ప్రధాన కారణాలు ఏమంటే..?

అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల ప్రభావంతో దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. బుధవారం ఒక్కరోజే 1600 పాయింట్లకుపైగా నష్టంలో సెన్సెక్స్‌ ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ నిన్నటి ముగింపుతో పోల్చితే ఏకంగా 2.23 శాతం నష్టపోయింది. చివరకు 1,628 పాయింట్ల నష్టంతో 71,701 పాయింట్ల దగ్గర ముగిసింది.

Stock Market: కుప్పకూలిన స్టాక్ మార్కెట్ సూచీలు.. భారీ పతనానికి ప్రధాన కారణాలు ఏమంటే..?
India Stock Market News

Updated on: Jan 17, 2024 | 3:58 PM

అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల ప్రభావంతో దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. బుధవారం ఒక్కరోజే 1600 పాయింట్లకుపైగా నష్టంలో సెన్సెక్స్‌ ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ నిన్నటి ముగింపుతో పోల్చితే ఏకంగా 2.23 శాతం నష్టపోయింది. చివరకు 1,628 పాయింట్ల నష్టంతో 71,701 పాయింట్ల దగ్గర ముగిసింది. అటు నిఫ్టీ కూడా 450 పాయింట్లకు పైగా నష్టపోయింది. క్రితం ముగింపుతో పోల్చితే నిఫ్టీ 2.06 శాతం నష్టపోయింది. చివరకు 453.90 పాయింట్ల నష్టంతో 21,578 పాయింట్ల దగ్గర క్లోజ్ అయ్యింది. దాదాపు 16 నెలల తర్వాత ఇంత భారీ పతనం ఇదే. 1,011 షేర్లు లాభాలు ఆర్జించగా.. 2,226 షేర్లు నష్టాల్లో ముగిశాయి. 48 షేర్ల విలువలో మార్పు లేదు.

ఇండియన్ స్టాక్ మార్కెట్లపై అమెరికా మార్కెట్‌లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు తీవ్ర ప్రభావం చూపాయి. ద్రవ్య పరపతి విధానం ఆలస్యం కావొచ్చన్న యూఎస్ ఫెడ్ తెలిపిది. దీంతో యూఎస్‌ ఫెడరల్ బ్యాంక్ మార్చి నుంచి వడ్డీ రేట్లలో మార్పులు చేస్తుందనే సంకేతాలు వెలువడ్డాయి. దీంతో అమెరికా, ఐరోపా మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. అటు ఆసియా- ఫసిపిక్ మార్కెట్‌లోనూ దీని ప్రభావం నెలకొంది.  దీంతో ఉదయం నుంచే దేశీయ స్టాక్ మార్కెట్‌లో సెంటిమెంట్ బలహీనంగా ఉంది.

దేశీయ ఇన్వెస్టర్లను HDFC బ్యాంకు మూడో త్రైమాసిక ఫలితాలు తీవ్రంగా నిరాశపరిచాయి. HDFC బ్యాంకు షేర్లు 7.5 శాతం మేర పతనమయ్యాయి. హెచ్‌డీఎఫ్‌సీ ఫలితాలు మిగిలిన బ్యాంకింగ్ సెక్టార్ షేర్ల మిగతా బ్యాంక్‌ల షేర్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. దీంతో ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, కొటాక్ మహీంద్ర, ఎస్బీఐ తదితర ఇతర బ్యాంకుల షేర్లు 2 శాతం నుంచి 4శాతం మేర నష్టపోయాయి.హెచ్‌సీఎల్ టెక్, ఎస్బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్, టీసీఎస్, ఎల్‌టీఐ మైండ్ ట్రీ, ఇన్ఫోసిస్ తదితర ఐటీ రంగ షేర్లు లాభాల్లో ముగిశాయి.

అటు అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ నెల రోజుల గరిష్ఠానికి పడిపోయింది. స్టాక్ మార్కెట్ సూచీలు ఆల్ టైమ్ హై స్థాయికి చేరుకోవడంతో కొంత మేర కరెక్షన్స్‌కు అవకాశముందని గత కొన్ని రోజులుగా మార్కెట్ నిపుణులు అంచనావేశారు. దీని ప్రభావం కూడా స్టాక్ మార్కెట్ సూచీలపై బుధవారంనాడు ఉన్నట్లు తెలుస్తోంది.