Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. ఆల్‌టైమ్‌ కనిష్ఠ స్థాయికి చేరిన ఎల్‌ఐసీ షేర్లు..

|

Jun 07, 2022 | 4:06 PM

మంగళవారం స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. కన్సుమర్‌, ఐటీ షేర్లు పడిపోవడంతో స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి...

Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. ఆల్‌టైమ్‌ కనిష్ఠ స్థాయికి చేరిన ఎల్‌ఐసీ షేర్లు..
Stock Market
Follow us on

మంగళవారం స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. కన్సుమర్‌, ఐటీ షేర్లు పడిపోవడంతో స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్‌లో వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉండడంతో పెట్టుబడిదారులు జాగ్రత్త పడ్డారు. ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశం రేపు ముగియనుంది. వడ్డీ పెంపుదల ఉందో లేదో బుధవారం తెలియనుంది. యూఎస్‌ ద్రవ్యోల్బణం డాటా కోసం పెట్టుబడిదారులు వేచిచూస్తున్నారు. ఈరోజు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 568 పాయింట్లు పడిపోయి 55,107 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ153 పాయింట్లు తగ్గి16,416 వద్ద స్థిరపడింది.

మిడ్‌ క్యాప్‌ 0.67 శాతం, స్మాల్‌ క్యాప్‌ 0.59 శాతం నష్టపోయాయి. సబ్‌ ఇండెక్స్‌ల్లో నిఫ్టీ కన్సుమర్ డ్యూరబుల్స్‌ 2.26, నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ 1.54 శాతం, నిఫ్టీ ఐటీ1.57 శాతం పడిపోయాయి. టైటాన్‌ నిఫ్టీ టాప్‌ లూజర్‌గా నిలిచింది. ఈ స్టాక్‌ 4.48 శాతం పడిపోయి రూ.2,100 వద్ద స్థిరపడ్డాయి. యూపీఎల్‌, డా. రెడ్డీస్, బ్రిటనియ, ఎల్‌అండ్‌టీ నష్టాల్లో ముగిశాయి. ఏసియన్‌ పెయింట్స్‌, బాజాజ్‌ ఫైనాన్స్‌, టీసీఎస్‌, నెస్లే ఇండియా, బాజాజ్‌ ఫిన్‌సర్వ్‌, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌ కూడా నష్టాల్లో స్థిరపడ్డాయి. ఎన్టీపీసీ, మారుతి, ఎంఅండ్‌ఎం, భారతీ ఎయిర్‌టెల్‌ లాభాల్లో ముగిశాయి.