వరుస నష్టాల్లో ఉన్న స్టాక్ మార్కెట్లు(Stock Market) మంగళవారం భారీగా లాభపడ్డాయి. BSE సెన్సెక్స్ 776 పాయింట్లు పెరిగి 57,356 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 246 పాయింట్లు పెరిగి 17,200 వద్ద స్థిరపడింది. మహీంద్రా CIE ఆటోమోటివ్ మార్చి త్రైమాసికంలో నికర లాభం రూ. 10.09 కోట్ల నుంచి రూ. 161.42 కోట్లకు ఎగబాకడంతో ఆ స్టాక్ 13 శాతం పెరిగింది. అయితే రూ. 24,713 కోట్ల రిలయన్స్ డీల్ విఫలమవడంతో ఫ్యూచర్ గ్రూప్ కంపెనీల షేర్లు మంగళవారం మళ్లీ పతనమయ్యాయి. చైనా కఠినమైన COVID-19 అడ్డంకులు, దూకుడుగా ఉన్న US ఫెడరల్ రిజర్వ్ చర్యలు పెట్టుబడిదారుల్లో ఆందోళన ఉన్నప్పటికీ కొనుగోళ్లకు మొగ్గు చూపారు.
సెన్సెక్స్ 30 సూచీలో ఐదు షేర్లు మాత్రమే నష్టపోయాయి. యాక్సిస్ బ్యాంక్, మారుతీ, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, విప్రో షేర్లు నష్టాల్లో ముగిశాయి. పవర్‌గ్రిడ్, టైటన్, ఎంఅండ్‌ఎం, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ, ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్, సన్‌ఫార్మా, హెచ్‌యూఎల్ షేర్లు లాభపడ్డ వాటిలో ఉన్నాయి.
క్యాంపస్ యాక్టివ్‌వేర్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ ఈరోజు ప్రారంభమైంది. రిటైల్ విభాగంలో 1.48 రెట్ల అధిక స్పందన లభించగా.. సంస్థాగతయేతర మదుపర్ల వాటాలో 52 శాతం షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ విభాగంలో 9 శాతం షేర్లు సబ్‌స్క్రైబ్ అయ్యాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఏడాది నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈరోజు కంపెనీ షేర్లు 2.5 శాతం వరకు లాభపడ్డాయి.
మరిన్ని బిజినెస్ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి.
Read Also.. RBI Investment: ఆర్బీఐ వద్ద రిస్క్ లేకుండా ఇలా పెట్టుబడి పెట్టండి.. బంపర్ ఆదాయం కూడా..