Stock Market: వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. పడిపోయిన హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌ షేర్లు..

|

Apr 06, 2022 | 5:05 PM

వరుసగా రెండో రోజు స్టాక్ మార్కెట్లు(Stock Market) నష్టాల్లో ముగిశాయి. ఫైనాన్షియల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) స్టాక్‌ల కారణంగా మార్కెట్లు నష్టపోయాయి.

Stock Market: వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. పడిపోయిన హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌ షేర్లు..
Stock Market
Follow us on

వరుసగా రెండో రోజు స్టాక్ మార్కెట్లు(Stock Market) నష్టాల్లో ముగిశాయి. ఫైనాన్షియల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) స్టాక్‌ల కారణంగా మార్కెట్లు నష్టపోయాయి. చమురు ధరల పెరుగుదల, U.S. ఫెడరల్ రిజర్వ్ దూకుడుతో పెట్టుబడిదారులు జాగ్రత్తగా మారారు. దీంతో బుధవారం బీఎస్‌ఈ(BSE) సెన్సెక్స్ 566 పాయింట్లు తగ్గి 59,610 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 150 పాయింట్లు పడిపోయి 17,808 వద్ద స్థిరపడింది. మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.59 శాతం పడిపోయింది. స్మాల్ క్యాప్ 0.12 శాతం నష్టపోయింది. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.59 శాతం, నిఫ్టీ ఐటి1.63 శాతం పడిపోయాయి.

హెచ్‌డీఎఫ్‌సీ3.30 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 3.59 శాతం పతనమయ్యాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా కూడా నష్టాల్లో ముగిశాయి. విలీన ప్రకటన తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సోమవారం దాదాపు 10 శాతం పెరిగాయి. పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ఆ కంపెనీల షేర్లు పడిపోయాయి. 2,198 కంపెనీల షేర్లు పెరగ్గా 1,196 కంపెనీల షేర్లు నష్టపోయాయి. టెక్‌ఎమ్, ఇన్ఫోసిస్, టిసిఎస్, ఎంఅండ్ఎం టాప్ నష్టాలను మూటగట్టుకున్నాయి. NTPC, టాటా స్టీల్, పవర్‌గ్రిడ్, భారతీ ఎయిర్‌టెల్, నెస్లే ఇండియా, L&T, SBI లాభాల్లో ముగిశాయి.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బ్రిటిష్‌ ఇంధన దిగ్గజం బీపీల సంయుక్త సంస్థ జియో-బీపీ, టీవీఎస్‌ మోటార్‌లు కలిసి ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాల కోసం ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నాయి. దీంతో టీవీఎస్‌ మోటార్‌ షేర్లు ఈరోజు 1 శాతానికి పైగా లాభపడ్డాయి. మార్చితో ముగిసిన త్రైమాసికంలో నామమాత్రపు వృద్ధిని మాత్రమే నమోదు చేయనున్నామన్న మారికో ప్రకటనతో ఆ కంపెనీ షేర్లు ఈరోజు 4.8 శాతానికి పైగా పతమయ్యాయి.

Read Also.. Azim Premji: తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెడతామన్న అజీమ్ ప్రేమ్‌జీ.. ప్రభుత్వ పనితీరుపై కితాబు..