కొత్త స్మార్ట్‌ఫోన్‌కు మారుతున్నారా..? ఈ టిప్స్ పాటించకపోతే మీ ఖాతా మొత్తం ఖాళీ.. బీ కేర్‌ఫుల్..

పాత ఫోన్ విక్రయిస్తున్నారా.. అందులో మీ బ్యాంకింగ్ సమాచారం, బ్యాంకింగ్ యాప్స్ ఉన్నాయా.. అయితే మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే భారీగా నష్టపోయే అవకాశముంటుంది. ఇటీవల సైబర్ మోసాలు పెరిగిపోతున్న క్రమంలో పాత ఫోన్ అమ్ముతంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

కొత్త స్మార్ట్‌ఫోన్‌కు మారుతున్నారా..? ఈ టిప్స్ పాటించకపోతే మీ ఖాతా మొత్తం ఖాళీ.. బీ కేర్‌ఫుల్..
Banking

Updated on: Sep 02, 2026 | 8:05 PM

చాలామంది తరచుగా స్మార్ట్‌ఫోన్లు మార్చుతూ ఉంటారు. కొత్త ఫీచర్లతో కూడిన ఫోన్ మార్కెట్లోకి రాగానే పాత ఫోన్‌ను పక్కన పెట్టడం లేదా విక్రయించడం చేస్తూ ఉంటారు. ఇటీవల సైబర్ మోసాలు పెరుగుతున్న క్రమంలో పాత ఫోన్ విక్రయించేటప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా బ్యాంకింగ్ యాప్స్ ఇన్‌స్టాల్ చేసి ఉంటే మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్ యాప్స్ ప్రైవసీ సెట్టింగ్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. పాత ఫోన్ అమ్మేటప్పుడు బ్యాంకింగ్ యాప్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? కొత్త ఫోన్‌లో ఎలాంటి సెట్టింగ్ పెట్టుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

పాత ఫోన్ అమ్మేస్తుంటే ఇది తప్పనిసరి

మీరు పాత ఫోన్ అమ్మేస్తుంటే కేవలం ఫోన్ నుంచి బ్యాంకింగ్ యాప్స్ డిలీట్ చేస్తే సరిపోతుందని చాలామంది అనుకుంటారు. కానీ అది పొరపాటు. కేవలం డిలీట్ చేయడమే కాకుండా సైన్ అవుట్ చేయాలి. అలాగే మీ ఫోన్‌లో సేవ్ చేసిన పాస్ వర్డ్స్, పర్సనల్ డేటా వంటి వివరాలను తొలగించాలి. ఒకవేళ మీ డేటాను బ్యాకప్ పెట్టుకుని ఉంటే ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి. దీని వల్ల మీ బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించిన డేటా మొత్తం కనిపించకుండా పోతుంది. ఈ పనులు చేయడం వల్ల వేరేవారికి ఫోన్ దొరికినా ఎలాంటి సమాచారం ఉండదని, దీని వల్ల మీ బ్యాంకింగ్ సమాచారం లీవ్ అవ్వదని చెబుతున్నారు. దీంతో సైబర్ మోసాల బారిన పడరని సూచిస్తున్నారు. కొంతమంది తరచుగా ఫోన్లు మారుస్తూ ఉంటారు. కానీ ఈ జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోతుంటారు. దీని వల్ల మీ బ్యాంక్ ఖాతాలోని డబ్బులు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంటుంది.

కొత్త ఫోన్‌కు మారుతున్నారా..

కొత్త ఫోన్‌కు మారినప్పుడు ఆ డివైజ్‌లో బ్యాంకింగ్ యాప్స్ పనిచేసేంతవరకు పాత డివైజ్‌ను మీ వద్దే ఉంచుకోండి. అన్నీ పనులు పూర్తయిన తర్వాత దానిని విక్రయించండి. కొత్త ఫోన్‌కు కేవలం కాంట్రాక్ట్స్, ఫొటోలు, వాట్సప్ ఛాట్స్ మాత్రమే ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉంటారు. కానీ బ్యాంకింగ్ యాప్స్ గురించి పట్టించుకోరు. కొత్త ఫోన్‌లో యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్స్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఎనేబుల్ చేసుకోండి. ట్రాన్సాక్షన్ అలర్ట్స్, లాగిన్ నోటిఫికేషన్లు, అకౌంట్ అప్డేట్స్ ఎనేబుల్ చేసుకోవాలి. దీని వల్ల మీకు బ్యాంకింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. ఎవరైనా మీ బ్యాంక్ వివరాలతో లాగిన్ అయితే మీకు వెంటనే తెలుస్తుంది. ఇక స్క్రీన్ లాక్, ఫింగర్ ప్రింట్, ఫేసియల్ రికగ్నిషన్ ఎనేబుల్ చేసుకోండి. ఇక బ్యాంకింగ్ యాప్స్‌ను కేవలం అధికారిక యాప్ స్టోర్ల నుంచి మాత్రమే డౌన్ లోడ్ చేసుకోండి.

Loading...
Unable to load recommendations.
Follow Us