School Holidays: భారీ వర్షాలు.. పాఠశాలలకు సెలవులు ప్రకటించిన అధికారులు!

School Holidays: దేశ వ్యాప్తంగా రుతు పవనాల ప్రభావం కనిపిస్తోంది. మే చివరి వారంలో భారీగా వర్షాలు కురిసి జూన్‌ ప్రారంభంలో తగ్గుముఖం పట్టాయి. అయితే మళ్లీ రుతుపవనాల ప్రభావం పుంచుకుంటోంది. పలు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నారు అధికారులు..

School Holidays: భారీ వర్షాలు.. పాఠశాలలకు సెలవులు ప్రకటించిన అధికారులు!

Updated on: Jun 26, 2025 | 12:01 PM

ఈ వారం రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున కర్ణాటక, కేరళలోని అధికారులు అనేక జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. వివిధ ప్రాంతాలలో నివసించే వారికి భద్రతా సలహాలు కూడా జారీ చేశారు అధికారులు. కర్ణాటకలో, దక్షిణ కన్నడ జిల్లాలోని బెల్తంగడి తాలూకాలోని అన్ని అంగన్‌వాడీ, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు జూన్ 26న ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూసివేశారు. అయితే వర్షాలు భారీగా కురుస్తుండటంతో మరిన్ని రోజులు సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. దక్షిణ కన్నడ జిల్లా యంత్రాంగం జిల్లా అంతటా అధికారికంగా సెలవు ప్రకటించనప్పటికీ, గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా బెల్తంగడి తాలూకాలోని పాఠశాలలు మూసి ఉంచారని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది.

రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో కొడగు జిల్లా కూడా పాఠశాలలకు వర్షపు సెలవు ప్రకటించింది. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న, లోతట్టు ప్రాంతాలలో జిల్లా అధికారులు తనిఖీలను పెంచారు. అధికారికంగా ప్రకటించే వరకు పాఠశాలలు తెరవవద్దని విద్యాశాఖ సూచించింది. అలాగే తరలింపు సన్నాహాలు, తాత్కాలిక ఆశ్రయాలు వంటి భద్రతా చర్యలను బలోపేతం చేశారు.

ఇది కూడా చదవండి: Upcoming Smartphones: జూలైలో ఏయే ఫోన్లు విడుదల అవుతున్నాయో తెలుసా? పవర్‌ఫుల్‌ ప్రాసెసర్‌తో..

ఇవి కూడా చదవండి

అలాగే పొరుగున ఉన్న కేరళలో ఇడుక్కితో సహా కనీసం మూడు జిల్లాలు జూన్ 26న విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాయని ఆన్‌మనోరమ తెలిపింది. తదుపరి ఆదేశాల వరకు విద్యా సంస్థలు తెరవవద్దని ప్రభుత్వం సూచించింది. రాష్ట్రంలోని అనేక ఇతర జిల్లాలు కూడా ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తరగతులను నిలిపివేసినట్లు ది హిందూ నివేదించింది. కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ స్థానిక అధికారులను అప్రమత్తంగా ఉండాలని కోరింది.

గురువారం కేరళలో రుతుపవనాల వర్షాలు తీవ్రమయ్యాయి. ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిస్సూర్ జిల్లాలు జలమయం అయ్యాయి. భారత వాతావరణ శాఖ (IMD) ఉదయం ఏడు జిల్లాల్లో ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. కొల్లం, పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకుళం, త్రిస్సూర్ జిల్లాల్లో ఉదయం మూడు గంటల పాటు IMD ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. ‘ఆరెంజ్ అలర్ట్’ అంటే 11 సెం.మీ నుండి 20 సెం.మీ వరకు భారీ వర్షపాతం నమోదవుతుంది. ఇంతలో వాయనాడ్ జిల్లాలోని ముందక్కై-చూర్లమల ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చూర్లమల నది పొంగి ప్రవహించింది. గత సంవత్సరం జూలైలో, ఈ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో 200 మంది మరణించారు. లెక్కలేనన్ని ఇళ్ళు ధ్వంసమయ్యాయి.

గత 24 గంటల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా వయనాడ్‌లోని ముందక్కై-చూర్లమల ప్రాంతంలో కొత్తగా వరదలు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఇక్కడ భారీ కొండచరియలు విరిగిపడి 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయి సరిగ్గా ఒక సంవత్సరం తరువాత మళ్లీ కొండ చరియలు విరిగి పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. చూర్లమల నది ఉప్పొంగి ప్రవహిస్తోందని, బురద నీరు వేగంగా ప్రవహిస్తోందని, బెయిలీ వంతెన సమీపంలో నది ఒడ్డున కోతకు గురవుతోందని జిల్లా అధికారులు బుధవారం తెలిపారు. నదికి ఇరువైపులా మరమ్మతు పనుల కోసం నిల్వ చేసిన మట్టి కొట్టుకుపోయి, అట్టమల రహదారి, పరిసర ప్రాంతాలను ముంచెత్తింది. ఇటీవల కొండచరియలు విరిగిపడటం కొండ ప్రాంతాలలో, ముఖ్యంగా పుంచిరిమట్టం సమీపంలోని అటవీ ప్రాంతాలలో సంభవించిందని స్థానిక నివాసితులు విశ్వసిస్తున్నారు.

ఇది కూడా చదవండి: School Bags: జపాన్‌లో స్కూల్‌ బ్యాగుల ధరలు భారీగా ఎందుకు ఉంటాయి? ఒక్కో బ్యాగు ధర రూ.18 వేల నుంచి రూ.60 వేలు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..