SBI Zero Balance Savings Account: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (బీఎస్‌బీడీ) ఖాతాను జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతా అని పిలుస్తారు. ఇది ఒక పొదుపు ఖాతా. కొన్ని కనీస సౌకర్యాలను ఉచితంగా వినియోగదారులకు అందిస్తోంది. అయితే నాలుగు ఉచిత లావాదేవీలకు మించి బీఎస్‌బీడీ ఖాతాల్లో ని డిజిటల్ లావాదేవీలపై వసూలు చేసిన ఛార్జీలను ఎస్‌బీఐ స్పష్టతనిచ్చిన విషయం తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆగస్టు 2012లో 4 ఉచిత లావాదేవీలకు మించి బీఎస్‌బీడీ ఖాతాలలో సహేతుకమైన ఛార్జీలు వసూలు చేయడానికి బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. దీని ప్రకారం ఎస్‌బీఐ బీఎస్‌బీడీ ఖాతాలలో నాలుగు ఉచిత లావాదేవీలకు మించి డెబిట్ లావాదేవీల కోసం ఛార్జీలను ప్రవేశపెట్టింది. ఇది జూన్ 5, 2016 నుంచి కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. అయితే 2020 ఆగస్టులో చేసిన డిజిటల్ లావాదేవీలపై జనవరి 2020 తర్వాత నుంచి వసూలు చేసిన ఛార్జీలను తిరిగి చెల్లించాలని సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ బ్యాంకులకు సూచించింది. జనవరి 2020 నుంచి సెప్టెంబర్ 2020 వరకు వసూలు చేసిన ఛార్జీలను బీఎస్‌బీడీ వినియోగదారులకు ఎస్‌బీఐ తిరిగి చెల్లించింది.
ఖాతా తెరిచే సమయంలో కూడా కనీస బ్యాలెన్స్ అవసరం లేదు. కస్టమర్లకు ఎటువంటి రుసుము లేకుండా ఏటీఎం కమ్ డేబిట్ కార్డు అందిస్తుంది. డిపాజిట్, ఉపసంహరణ సేవలు ఉచితం. అలాగే పని చేయని ఖాతాలకు, తిరిగి యాక్టివ్ చేసేందుకు కూడా ఛార్జీలు విధించదు.
ఎస్‌బీఐ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతా ఒక నెలలో గరిష్టంగా నాలుగు నగదు ఉపసంహరణలను ఉచితంగా అనుమతిస్తుంది. ఎస్‌బీఐ, ఇతర బ్యాంకుల ఏటీఎంలలో కూడా ఈ లావాదేవీలు ఉచితం.
సాధారణ పొదుపు బ్యాంకు ఖాతాల మాదిరిగానే జీరో బ్యాలెన్స్ ఖాతాలపై ఎస్‌బీఐ వడ్డీ రేటును అందిస్తుంది. రూ.1 లక్ష వరకు డిపాజిట్లపై బ్యాంకు సంవత్సరానికి 2.70 శాతం వడ్డీ రేటును ఇస్తుంది. ఎస్‌బీఐ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతా నుంచి నెలలో గరిష్టంగా 4 నగదు ఉపసంహరణలను ఉచితంగా అనుమతిస్తుంది.
ఇవీ చదవండి: SBI Customers: ఎస్‌బీఐ కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్.. రూ. 10వేలకు రూ.520 ఈఎంఐ.. ప్రాసెసింగ్ ఫీజు ఫ్రీ…