దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు శుభవార్త అందించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే పలు రకాల సేవలు అందిస్తున్న బ్యాంకుల.. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించే విధంగా చర్యలు చేపడుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో 300 కొత్త శాఖలను తెరవాలని బ్యాంక్ యోచిస్తోంది. పీటీఐ వార్త సంస్థ నివేదిక ప్రకారం.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ శాఖలన్నీ తెరవబడతాయి. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి దేశవ్యాప్తంగా 22,405 శాఖలు ఉండగా, విదేశాల్లో 235 శాఖలు ఉన్నాయి. కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించిన తర్వాత, దేశంలోని స్టేట్ బ్యాంక్ దేశీయ శాఖల సంఖ్య 23,000 బ్రాంచ్‌లను మించిపోతుంది.
స్టేట్ బ్యాంక్ ఛైర్మన్ దినేష్ ఖరా మాట్లాడుతూ మా బ్యాంక్ వ్యాపారాన్ని డిజిటల్‌గా పెంచడానికి ప్రయత్నిస్తున్నామని తెలియజేశారు. దీనితో పాటు, బ్యాంక్ శాఖల సంఖ్యను పెంచడానికి ఎస్‌బీఐ ఈ సంవత్సరం 300 కంటే ఎక్కువ కొత్త శాఖలను తెరవనుంది. బ్రాంచ్‌ను తెరిచేటప్పుడు బ్రాంచ్ ఎక్కడ ఎక్కువగా అవసరమో బ్యాంకు గుర్తుంచుకోవాలి. దీని ఆధారంగానే శాఖ ఎక్కడ అనేది కూడా నిర్ణయిస్తారు. దీనితో పాటు కస్టమర్ల అవసరాలను ఎస్‌బిఐ అర్థం చేసుకుంటుందని, వారి అవసరాలకు అనుగుణంగా సేవలను అందించడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు.
ఈ విషయంపై స్టేట్ బ్యాంక్ రిటైల్ బిజినెస్ అండ్ ఆపరేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ అలోక్ కుమార్ చౌదరి మాట్లాడుతూ.. బ్యాంక్ తన సొంత వ్యూహంతో పనిచేస్తోందని, ఇప్పటికే ఉన్న ఫ్రాంచైజీలతో సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి ప్రయత్నిస్తోందని చెప్పారు. నికర వడ్డీ మార్జిన్ గురించి సమాచారం ఇస్తూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 3.5 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చైర్మన్ దినేష్ ఖరా తెలిపారు.
దీన్ని 3.47 శాతం వరకు కొనసాగించగలమని బ్యాంకు ఆశాభావం వ్యక్తం చేసింది. బ్యాంక్ త్రైమాసిక ఫలితాల గురించి మాట్లాడుతూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో బ్యాంక్ రికార్డు స్థాయిలో 16,884 కోట్ల రూపాయల లాభాన్ని సాధించింది. దీంతో పాటు బ్యాంకు ఎన్‌పీఏలో కూడా భారీ క్షీణత నమోదైంది. గతేడాది ఇదే కాలంలో బ్యాంక్ లాభం 6,068 కోట్ల రూపాయలుగా ఉంది. ఇలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వినియోగదారుల కోసం ఎన్నో సేవలను అందిస్తోంది. ప్రస్తుతం బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లకుండా ఇంట్లోనే ఆన్‌లైన్ ద్వారా వివిధ రకాల సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. వినియోగదారులకు మరిన్ని సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని ఆయన అన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి