SBI Easy Ride: మధ్యతరగతి, సామాన్య ప్రజలు.. బైక్ కొనేందుకు చాలా కష్టపడుతుంటారు. ద్విచక్రవాహనం కొనాలన్న కోరిక.. ఎప్పటికీ కలగానే మిగులుతుంది. అలాంటి వారి కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్‌న్యూస్ చెప్పింది. సామన్య ప్రజలు ఇష్టమైన ద్విచక్రవాహనాలను కొనుగోలు చేసేందుకు లోన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్ యోనో ద్వారా ప్రీ-అప్రూవ్డ్ టూ-వీలర్ లోన్ స్కీమ్ ‘ఎస్‌బీఐ ఈజీ రైడ్’ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రారంభించింది. అర్హత ఉన్న ఎస్‌బీఐ కస్టమర్‌లు ఆయా బ్యాంకుల శాఖలను సందర్శించకుండానే YONO యాప్ ద్వారా ఆన్-రోడ్ ధరలో 85 శాతం వరకు ద్విచక్ర వాహన రుణాలను పొందవచ్చు. ఈజీ రైడ్ లోన్ భాగంగా.. కస్టమర్లు గరిష్టంగా నాలుగు సంవత్సరాల పాటు సంవత్సరానికి 10.5 శాతం వడ్డీ రేటుతో రూ.3 లక్షల వరకు లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఎస్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. కనీస రుణం మొత్తం రూ.20,000గా నిర్ణయిస్తూ ఎస్‌బీఐ వెల్లడించింది.
అయితే.. ఒక లక్షకు ఈఎమ్‌ఐ (EMI) రూ.2,560 మాత్రమే అని బ్యాంక్ స్పష్టంచేసింది. అయితే.. రుణ మంజూరు అనంతరం నగదు నేరుగా డీలర్ ఖాతాలో జమ చేయబడుతుందని స్పష్టంచేసింది. ఎస్‌బీఐ ఈజీ రైడ్ గురించి.. బ్యాంకు ఛైర్మన్ దినేష్ కుమార్ ఖరా మాట్లాడుతూ.. కస్టమర్ల ప్రయోజనం కోసం ఈ డిజిటల్ లోన్ ఆఫర్ ద్విచక్ర వాహన రుణాన్ని అందించనున్నట్లు తెలిపారు. దీనిద్వారా కస్టమర్లకు మేలు జరుగుతుందని.. అదికూడా ఆన్‌రోడ్ ధరకే బైక్ సొంతమవుతుందన్నారు. వారి కలతోపాటు.. వృద్ధి కూడా జరుగుతుందని తెలిపారు.
కాగా.. వాహనాలు కొనేటప్పుడు ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలు అధిక వడ్డితో లోన్‌ను మంజూరు చేస్తాయి. అనంతరం చెల్లింపులు సరిగా చేపట్టకపోతే.. మళ్లీ అదనపు భారం కూడా అవుతుంది. ఈ క్రమంలో ఎస్‌బీఐ ఈజీ రైడ్‌ను తీసుకురాడం గొప్పపరిణామని.. వ్యాపారవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
Also Read: