SBI Home Loans : సొంతింటి కలను నిజం చేసుకుందామని అనుకునేవారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఏడాది మార్చి 31 వరకూ ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసింది. అంతేకాదు ఏడాదికి కనిష్ఠంగా 6.8 శాతం వడ్డీతో హోంలోన్స్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఎస్‌బీఐ వివిధ రకాల హోం లోన్స్‌ను అందిస్తోంది.. ఇందులో సాధారణ హోంలోన్లతోపాటు ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎస్‌బీఐ ప్రివిలెజ్ హోంలోన్, ఆర్మీ, రక్షణ రంగ సిబ్బందికి ఎస్‌బీఐ శౌర్య హోంలోన్‌లతోపాటు ఎస్‌బీఐ స్మార్ట్‌హోమ్, ఎస్‌బీఐ ఎన్నారై హోంలోన్‌లాంటివి అందిస్తోంది.
కొత్తగా హోంలోన్ కావాలని అనుకునే వాళ్లు 7208933140 నంబర్‌కు మిస్ కాల్ ఇస్తే సరిపోతుంది. మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చని ఎస్‌బీఐ వెల్లడించింది. అతి తక్కువ వడ్డీరేట్లతో ఇప్పటికే దేశంలో హోంలోన్ షేర్‌లో 34 శాతం వాటా ఎస్‌బీఐదే కావడం విశేషం. సగటున రోజుకు వెయ్యి మంది హోంలోన్ కస్టమర్లు వస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.
Also read:
Breaking News: నల్గొండ జిల్లాపై వరాల జల్లు కురిపించిన సీఎం కేసీఆర్.. రేపు జీవో విడుదల చేస్తామంటూ..