SBI Fake Website Fraud: కస్టమర్లను మోసం చేసేందుకు ఎస్‌బీఐ నకిలీ వెబ్‌సైట్‌.. అప్రమత్తం చేస్తూ వీడియో విడుదల

|

Aug 09, 2023 | 3:16 PM

ఎస్‌బీఐకి చెందిన నకిలీ వెబ్‌సైట్ ద్వారా దుండగులు కస్టమర్లను మోసం చేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి వెబ్‌సైట్‌లను ఎవరైనా సందర్శించినప్పుడు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు దీనిపై దృష్టి సారిస్తే మోసాల బారిన పడకుండా ఉండొచ్చు. అంతే కాకుండా కొరియర్ సర్వీసులు, ట్రావెల్స్ పేరుతో అనేక నకిలీ వెబ్‌సైట్లపై క్లిక్‌ చేస్తూ మోసాలకు గురవుతున్నారు..

SBI Fake Website Fraud: కస్టమర్లను మోసం చేసేందుకు ఎస్‌బీఐ నకిలీ వెబ్‌సైట్‌.. అప్రమత్తం చేస్తూ వీడియో విడుదల
Sbi Fake Website Fraud
Follow us on

సైబర్‌ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. సైబర్‌ నేరగాళ్లు గూగుల్‌లో అనేక నకిలీ వెబ్‌సైట్‌లను సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు. ఎస్‌బీఐ (ఎస్‌బీఐ ఫేక్ వెబ్‌సైట్ ఫ్రాడ్) పేరుతో అలాంటి వెబ్‌సైట్ కూడా సృష్టించినట్లు వెలుగులోకి వచ్చింది. దానిపై సెర్చ్ చేస్తున్న కొంతమందికి వినియోగదారులు నకిలీ లింక్‌పై క్లిక్‌ చేసి క్రెడిట్ కార్డ్, కేవైసీ అప్‌డేట్ చేసుకుంటున్నారు. దీంతో వివరాలన్ని నేరగాళ్లకు చేరిపోతున్నాయి. వివరాలు అందుకుంటున్న నేరగాళ్లు వారి అకౌంట్ల నుంచి డబ్బులు డ్రా చేసేసుకుంటున్నారు. ఆ తర్వాత సదరు కస్టమర్లకు తమ అకౌంట్‌ నుంచి డబ్బులు విత్‌డ్రా అయినట్లు మెసేజ్‌ రావడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్నారు. చివరికి తాము సైబర్‌ నేరగాళ్ల బారిన పడి మోసపోయినట్లు తెలుసుకుంటున్నారు.

ఎస్‌బీఐకి చెందిన నకిలీ వెబ్‌సైట్ ద్వారా దుండగులు కస్టమర్లను మోసం చేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి వెబ్‌సైట్‌లను ఎవరైనా సందర్శించినప్పుడు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు దీనిపై దృష్టి సారిస్తే మోసాల బారిన పడకుండా ఉండొచ్చు. అంతే కాకుండా కొరియర్ సర్వీసులు, ట్రావెల్స్ పేరుతో అనేక నకిలీ వెబ్‌సైట్లపై క్లిక్‌ చేస్తూ మోసాలకు గురవుతున్నారు.

ఆన్‌లైన్ బ్యాంకింగ్ పోర్టల్‌ల ద్వారా మోసం

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)కి రెండు పోర్టల్‌లు ఉన్నాయి, కార్పొరేట్ సమాచారం కోసం www.sbi.co.in, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కోసం www.onlinesbi.com ఉన్నాయి. బ్యాంక్ దాని స్వంత డొమైన్ పొడిగించుకుంటూ sbi (.com లేదా .co.in వంటివి) కూడా కొనుగోలు చేసింది. ఈ సైట్లను కూడా ఎస్‌బీఐ ఉపయోగించుకుంటోంది. అయితే, మోసగాళ్లు బ్యాంక్ ఆన్‌లైన్ బ్యాంకింగ్ పోర్టల్‌ను దుర్వినియోగం చేసి ఎస్‌బిఐ సొంత ఆన్‌లైన్ వెబ్‌సైట్ మాదిరిగానే www.onlinesbi.digital పోర్టల్‌ను రూపొందించారు.

ఇవి కూడా చదవండి

మొబైల్ బ్యాంకింగ్ కోసం ఎస్‌బీఐ అధికారిక యాప్ YONO SBI. మీరు ఎస్‌బీఐ కస్టమర్ అయితే, మొబైల్ బ్యాంకింగ్ కోసం ఈ యాప్‌ని ఉపయోగించారని నిర్ధారించుకోండి. మోసగాళ్లు బ్యాంక్ కస్టమర్‌లకు లింక్‌తో SMS పంపుతారు. ఈ ఎస్‌ఎంఎస్‌లను చూసి వారు పంపిన లింక్‌పై క్లిక్‌ చేసినట్లయితే మోసపోతారని గుర్తించుకోండి.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

  • సోషల్ మీడియా ద్వారా వచ్చిన సందేశంలోని లింక్‌పై ఎప్పుడూ క్లిక్ చేయవద్దు.
  • మీరు బ్యాంక్ వెబ్‌సైట్‌ని సందర్శించాలనుకుంటే పూర్తి URLని టైప్ చేయండి.
  • బ్యాంక్ వెబ్‌సైట్ వెబ్ చిరునామాలో https ఉపయోగించబడిందో లేదో తనిఖీ చేయండి.
  • URL లేకుండా http మాత్రమే ఉంటే, ఈ పోర్టల్‌లో ఎలాంటి లావాదేవీలు చేయవద్దు.
  • మీ బ్యాంక్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు.
  • బ్యాంకు ఎప్పుడు కూడా OTPని బ్యాంకు అడగదని గుర్తించుకోండి.
  • మోసం జరిగితే మీరు భారత ప్రభుత్వ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి కాల్ చేయాలి.
  • మీకు ఏదైనా మోసం జరిగినట్లయితే  ఈ వెబ్ సైట్లో ఫిర్యాదు చేయవచ్చు.


మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి