SBI Credit Cards Rules: మీరు ఎస్‌బీఐ క్రెడిట్‌కార్డును వాడుతున్నారా..? జనవరి నుంచి ఈ రూల్స్ మారుతున్నాయని మీకు తెలుసా?

| Edited By: Anil kumar poka

Dec 15, 2022 | 3:22 PM

ప్రస్తుతం మనం ఎక్కడికైనా షాపింగ్ కు వెళ్లినా, లేదా ఆన్‌లైన్‌ షాపింగ్ చేసినా కార్డు ద్వారా కచ్చితంగా లావాదేవీలు జరుపుతున్నాం. ఈ నేపథ్యంలో అన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు వివిధ ఆఫర్లతో..

SBI Credit Cards Rules: మీరు ఎస్‌బీఐ క్రెడిట్‌కార్డును వాడుతున్నారా..? జనవరి నుంచి ఈ రూల్స్ మారుతున్నాయని మీకు తెలుసా?
SBI
Follow us on

ప్రస్తుతం మనం ఎక్కడికైనా షాపింగ్ కు వెళ్లినా, లేదా ఆన్‌లైన్‌ షాపింగ్ చేసినా కార్డు ద్వారా కచ్చితంగా లావాదేవీలు జరుపుతున్నాం. ఈ నేపథ్యంలో అన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు వివిధ ఆఫర్లతో క్రెడిట్ కార్డులు అందిస్తున్నాయి. అలాగే ఎస్‌బీఐ బ్యాంక్ కూడా తన ఖాతాదారులకు విరివిగా క్రెడిట్ కార్డులను జారీ చేస్తుంది. చిన్న, మధ్య తరగతి వినియోగదారులకు ఎస్ బీఐ సింప్లి క్లిక్ పేరుతో ఉన్న క్రెడిట్ కార్డులను ఎక్కువుగా జారీ చేస్తుంది. వారి వారి క్రెడిట్ స్కోర్ ను బట్టి రూ.15,000 లిమిట్ తో సింప్లి క్లిక్ కార్డులను అందించింది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు యూజర్లలో అధిక శాతం సింప్లి క్లిక్ క్రెడిట్ కార్డు యూజర్లే. ఈ నేపథ్యంలో వారికి షాక్ ఇస్తూ ఎస్బీఐ నిర్ణయం తీసుకుంది. జనవరి 2023 నుంచి వోచర్లు, రివార్డు పాయింట్ల రిడీమ్ కు సంబంధించి కొన్ని రూల్స్ మారుస్తూ ఎస్‌బీఐ పేమెంట్స్ అండ్ కార్డ్స్ వెబ్ సైట్ లో ప్రకటించింది. 

  • ముఖ్యంగా జనవరి 6, 2023 నుంచి ఎస్‌బీఐ తన సింప్లి క్లిక్ క్రెడిట్ కార్డు యూజర్లకు జారీ చేసే క్లియర్ ట్రిప్ వోచర్ ను కేవలం ఒక్కసారి మాత్రమే రిడీమ్ చేసుకోవాలి. అలాగే ఈ వోచర్ ఏ ఇతర వోచర్లతోనూ, ఆఫర్లతోనూ కలిపి రాదు. 
  • అలాగే జనవరి 01, 2023 నుంచి అమెజాన్ వెబ్ సైట్ లో కార్డు ద్వారా లావాదేవి జరిపితే వచ్చే 10 రివార్డు పాయింట్లను ఐదు పాయింట్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ అపోలో 24×7, బుక్ మై షో, క్లియర్ ట్రిప్, లెన్స్ కార్ట్, నెట్ మెడ్స్ వెబ్ సైట్లలో వచ్చే రివార్డ్స్ పాయింట్లు మాత్రం యధావిధిగా వస్తాయని వెబ్ సైట్ లో తెలిపింది. 
  • ఇటీవలే ఎస్ బీ ఐ తన ఈఎంఐ లావాదేవీలపై రూ.199 +జీఎస్టీ విధిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి విధితమే. అయితే  రెంట్ పేమెంట్స్ పై కూడా రూ.99 చార్జీని విధించింది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి