
యస్‌బీఐ SBI క్రెడిట్ కార్డుకి సంబంధించి కొన్ని ఫీజులు మారబోతున్నాయి. ఈ కొత్త ఫీజులు నవంబర్ 1, 2025 నుండి అమలులోకి వస్తాయి. ఇకనుంచి కొన్ని లావాదేవీలపై కొత్త ఛార్జీలు వర్తిస్తాయి. వీటిలో స్కూల్ ఫీజు చెల్లింపులు, థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా ట్రాన్సాక్షన్స్, క్రెడిట్ కార్డు నుంచి వాలెట్ లోకి యాడ్ చేసుకునేందుకు అదనపు ఛార్జీల వంటివి ఉన్నాయి. వీటి గురించిన పూర్తి వివరాలు మీ కోసం..
SBI క్రెడిట్ కార్డు కస్టమర్లు.. తమ కార్డు ద్వారా స్కూల్, కాలేజ్ లేదా ఇతర విద్యా సంస్థ ఫీజులు కట్టేందుకు థర్డ్ పార్టీ యాప్ ఉపయోగిస్తే ఇకపై ఒక శాతం ఛార్జీ ఉంటుంది. అంటే యాప్ ద్వారా రూ.10,000 ఫీజు చెల్లిస్తే, వారు అదనంగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ చెల్లింపు సంస్థ వెబ్‌సైట్ లేదా క్యాంపస్‌లోని POS మెషీన్ ద్వారా జరిగితే ఎటువంటి అదనపు ఛార్జీలు వర్తించవు.
నవంబర్ 1 నుండి SBI కార్డ్ వినియోగదారులు రూ.1,000 కంటే ఎక్కువ మొత్తాన్ని ఫోన్ పే, పేటియం వంటి వాలెట్ లకు యాడ్ చేసుకుంటే అదనంగా ఒక శాతం రుసుము చెల్లించాలి. ఉదాహరణకు డిజిటల్ వాలెట్‌లో రూ.2,000 యాడ్ చేస్తే అదనంగా రూ.20 చెల్లించాల్సి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి