SBI: ఎస్‌బీఐలో అదిరిపోయే స్కీమ్‌.. ఒకేసారి పెట్టుబడి పెడితే చాలు.. నెలకు రూ. 11 వేల ఆదాయం!

SBI: నెలనెల మంచి ఆదాయం పొందాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. నెలనెల ఆదాయం కోసం పోస్టాఫీసులతో పాటు బ్యాంకుల్లో రకరకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. మీరు ఒకేసారి మాత్రమే పెట్టుబడి పెట్టిన్లయితే నెలనెల వేలల్లో ఆదాయం పొందవచ్చు. అలాంటి స్కీమ్‌ ఎస్‌బీఐలో అందుబాటులో ఉంది. ఆ స్కీమ్‌ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

SBI: ఎస్‌బీఐలో అదిరిపోయే స్కీమ్‌.. ఒకేసారి పెట్టుబడి పెడితే చాలు.. నెలకు రూ. 11 వేల ఆదాయం!
SBI

Updated on: Mar 24, 2026 | 9:00 AM

SBI Scheme: మీరు సురక్షితమైన పెట్టుబడి పథకం కోసం చూస్తున్నారా? మీ వద్ద ఒకేసారి పెట్టుబడి పెట్టేందుకు కొంత పెద్ద మొత్తం ఉండి, ఎలాంటి రిస్క్ లేకుండా స్థిరమైన రాబడి పొందాలనుకుంటున్నారా? అయితే పోస్టాఫీస్ పథకాలు, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్స్‌తో పాటు ఎస్‌బీఐ (SBI) అందిస్తున్న ఎస్‌బీఐ యాన్యుటీ స్కీమ్‌ మీకు మంచి ఎంపికగా ఉంటుంది.

ఈ స్కీమ్ ఏమిటి?

ఈ పథకంలో మీరు ఒకేసారి మొత్తం డబ్బు పెట్టుబడి పెడతారు. ఆ తర్వాత ప్రతి నెలా మీకు వచ్చే మొత్తంలో అసలు + వడ్డీ రెండూ కలిపి అందుకుటారు. అంటే మెచ్యూరిటీ వరకు వేచి ఉండకుండా నెలనెలా ఆదాయం పొందొచ్చు.

ఇది కూడా చదవండి: Chicken Prices: మాంసం ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌.. కిలో చికెన్‌ ధర రూ.400

ఇవి కూడా చదవండి

ముఖ్య లక్షణాలు:

  • పూర్తిగా సురక్షితం: SBI బ్యాంక్ ద్వారా అందిస్తుంది.
  • నెలనెలా స్థిరమైన ఆదాయం
  • కనీస పెట్టుబడి రూ.1,000 మాత్రమే
  • గరిష్ఠ పరిమితి లేదు
  • కాలపరిమితి: కనీసం 3 సంవత్సరాలు – గరిష్ఠంగా 10 సంవత్సరాలు
  • లోన్ సౌకర్యం: డిపాజిట్‌పై 75% వరకు

వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి?

ఈ స్కీమ్‌కు ప్రత్యేకంగా వడ్డీ రేట్లు ఉండవు. SBI ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లే దీనికి వర్తిస్తాయి. టెన్యూర్ ఆధారంగా వడ్డీ మారుతుంది. కానీ రాబడి స్థిరంగా ఉంటుంది.

ఎలా రాబడి వస్తుంది?

ఇతర FD లాగా కాకుండా, ఇందులో మెచ్యూరిటీకి ఒకేసారి కాకుండా ప్రతి నెలా చెల్లింపులు అందుతాయి. ఇది ముఖ్యంగా రిటైర్డ్ వ్యక్తులు లేదా నెలవారీ ఆదాయం కోరుకునేవారికి అనుకూలంగా ఉంటుంది.

ఉదాహరణ: మీరు ఒకసారి రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టి 10 సంవత్సరాల కాలపరిమితి ఎంచుకుంటే:

సాధారణ కస్టమర్లకు (సుమారు 6.05% వడ్డీతో)

  • నెలకు సుమారు రూ.11,354
  • 10 సంవత్సరాల్లో మొత్తం సుమారు రూ.13.62 లక్షలు

సీనియర్ సిటిజెన్స్‌కు (సుమారు 7.05% వడ్డీతో):

  • నెలకు సుమారు రూ.11,630
  • మొత్తం సుమారు రూ.13.90 లక్షలు

ఈ పథకం అన్ని SBI బ్రాంచ్‌లలో అందుబాటులో ఉంటుంది. మరిన్ని వివరాలకు అధికారిక SBI వెబ్‌సైట్‌ను చూడవచ్చు. SBI Annuity Deposit Scheme అనేది రిస్క్ లేకుండా నెలనెలా స్థిరమైన ఆదాయం పొందాలనుకునే వారికి సరైన ఎంపిక. ఒకేసారి పెట్టుబడి పెట్టి, దీర్ఘకాలం పాటు ఆర్థిక భద్రతను పొందవచ్చు.

ఇది కూడా చదవండి: Gold Price Today: మహిళలకు పండగే.. పండగ.. రికార్డు స్థాయిలో పడిపోతున్న బంగారం, వెండి ధరలు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us