Samsung Mobile: శాంసంగ్ సరికొత్త ట్రై ఫోల్డ్ ఫోన్! రెండు సార్లు మడత పెట్టొచ్చు! డిజైన్ మాత్రం సూపర్!

ప్రస్తుతం మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్ల హవా నడుస్తోంది. అయితే ఇప్పుడున్న ఫోల్డబుల్ ఫోన్స్ అన్నీ కేవలం ఒకసారి మాత్రమే ఫోల్డ్ అవుతాయి. కానీ, శాంసంగ్ తీసుకురానున్న ట్రై ఫోల్డ్ ఫోన్ ను రెండు సార్లు మడతపెట్టొచ్చు. అంటే ఫోన్ లో మూడు స్క్రీన్స్ ఉంటాయన్న మాట. ఈ ఫోన్ డిజైన్ ఇంకా ఫీచర్లు ఎలా ఉంటాయంటే..

Samsung Mobile: శాంసంగ్ సరికొత్త ట్రై ఫోల్డ్ ఫోన్! రెండు సార్లు మడత పెట్టొచ్చు! డిజైన్ మాత్రం సూపర్!
Samsung Mobile Tri Fold

Updated on: Oct 13, 2025 | 3:18 PM

ఫోల్డబుల్ ఫోన్స్ లో కొత్త డిజైన్ ను తెరతీస్తూ శాంసంగ్ ట్రై ఫోల్డ్ ఫోన్ ను తీసుకురాబోతోంది. ఈ ఫోన్ మడత పెడితే 6 అంగుళాల మొబైల్ లా ఉంటుంది. ఓపన్ చేస్తే ట్యాబ్ అంత సైజులోకి మారిపోతుంది. ఈ ఏడాది చివరి నాటికి శాంసంగ్ తన మొట్టమొదటి ట్రైఫోల్డ్ ఫోన్‌ను విడుదల చేయనుందినున్నట్లు టెక్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ ఫోన్ గురించిన మరిన్ని డీటెయిల్స్ లోకి వెళ్తే..

లార్జెస్ట్ డిస్‌ప్లే

శాంసంగ్ గెలాక్సీ  జెడ్ ఫోల్డ్‌(Galaxy Z Fold) మొబైల్ త్రీ-ఫోల్డింగ్ డిజైన్‌‌తో వస్తుంది. ఇది పూర్తిగా తెరిచినప్పుడు 10 అంగుళాల కంటే పెద్ద అమోలెడ్ స్క్రీన్‌ గా మారుతుంది. ఇది యూజర్లకు ట్యాబ్ వంటి అనుభవాన్ని అందిస్తుంది. ఫోన్ ను మడిచినప్పుడు కవర్ డిస్‌ప్లే 6.5-అంగుళాలు ఉంటుంది.

స్పెసిఫికేషన్లు

ఇక ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది. ట్రై-ఫోల్డ్ డిజైన్ కారణంగా, ఇది రెండు లేదా మూడు బ్యాటరీ యూనిట్లు కలిగి ఉండొచ్చు. మొత్తం బ్యాటరీ కెపాసిటీ 6000mAh కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా. కెమెరా విషయానికొస్తే ఇందులో 200MP ప్రైమరీ కెమెరా, అల్ట్రా-వైడ్, టెలిఫోటో లెన్స్‌లను కలిగి ఉంటుంది.

ధరలు

శాంసంగ్ ట్రై ఫోల్డ్ ఫోన్ గురించిన అఫిషియల్ డీటెయిల్స్ ఇంకా రాలేదు. అయితే ఈ ఫోన్ మొదటగా చైనా, కొరియా మార్కెట్లలో లాంచ్ అవుతుంది. ఆ తర్వాత ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ ఫోన్ ధర సుమరు రూ.3,000 డాలర్లు అంటే సుమారు రూ. 2,64,000 వరకూ ఉండొచ్చు.