కరోనా ఎఫెక్ట్: విపరీతంగా పెరగనున్న స్మార్ట్ ఫోన్ ధరలు

| Edited By:

Mar 07, 2020 | 4:20 PM

కరోనా ఎఫెక్ట్‌తో దక్షణి కొరియాలోని శాంసంగ్ కంపెనీ.. తయారీ కేంద్రాన్ని మూసివేసింది. అంతేకాకుండా స్టార్ట్ ఫోన్ల ఉత్పత్తిని తాత్కాలికంగా వియత్నాంకు తరలిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది కూడా. తమ కంపెనీలో కూడా కరోనా వైరస్ సోకిన వ్యక్తులను..

కరోనా ఎఫెక్ట్: విపరీతంగా పెరగనున్న స్మార్ట్ ఫోన్ ధరలు
Follow us on

ప్రస్తుతం కరోనా మహమ్మారి.. ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తోన్న విసయం తెలిసిందే. ఇప్పటివరకూ కరోనా వైరస్‌.. మొత్తం 89 దేశాలకు పాకింది. మన దేశంలో కూడా ఇప్పటి వరకు 31పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీన్ని అంతం చేసే మందు ఇప్పటి వరకూ రాలేదు. కేవలం జాగ్రత్తలు పాటించడం తప్ప. ప్రపంచ దేశాలను గడగడ లాడిస్తున్న ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమౌతోంది.

కాగా.. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ కాస్తా.. సెల్ ఫోన్‌ల వినియోగంపై పడింది. ఇప్పటికే దక్షణి కొరియాలోని శాంసంగ్ కంపెనీ.. తయారీ కేంద్రాన్ని మూసివేసింది. అంతేకాకుండా స్టార్ట్ ఫోన్ల ఉత్పత్తిని తాత్కాలికంగా వియత్నాంకు తరలిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది కూడా. తమ కంపెనీలో కూడా కరోనా వైరస్ సోకిన వ్యక్తులను గుర్తించడం కారణంగా.. అతి పెద్ద శాంసంగ్ కంపెనీ.. కొన్ని రోజులు ఈ కంపెనీని మూసివేయనుంది. దీంతో.. రాబోయే రోజుల్లో.. ఫోన్ కొనాలనుకునే వారికి భారీగానే చెల్లించాల్సి ఉంటుంది.

అలాగే.. ముఖ్యంగా చైనాలోనో ఫోన్ల విడిభాగాలను తయారు చేస్తారు. ప్రస్తుతం ఈ వైరస్ దెబ్బతో ఫోన్ల విడిభాగాలు తయారు చేసే కంపెనీలు మూతపడుతుండటం కారణంగా ఫోన్ల ధరలు పెరగనున్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇది కూడా చదవండి:ఇకపై లీటర్ పెట్రోల్ ఉంటేనే బండి నడుస్తుంది