Rupee: బలహీనపడిన భారత కరెన్సీ.. డాలర్‌తో పోలిస్తే 10 పైసలు తగ్గిన రూపాయి..

|

Apr 18, 2022 | 9:11 PM

డాలర్‌(Dollar)తో పోలిస్తే రూపాయి(Rupee) బలహీనపడింది. వరుసగా మూడో ట్రేడింగ్ సెషన్‌లో దేశీయ కరెన్సీ క్షీణించింది...

Rupee: బలహీనపడిన భారత కరెన్సీ.. డాలర్‌తో పోలిస్తే 10 పైసలు తగ్గిన రూపాయి..
Rupee
Follow us on

డాలర్‌(Dollar)తో పోలిస్తే రూపాయి(Rupee) బలహీనపడింది. వరుసగా మూడో ట్రేడింగ్ సెషన్‌లో దేశీయ కరెన్సీ క్షీణించింది. విదేశీ మార్కెట్ల సంకేతాల కారణంగా రూపాయి బలహీనపడింది. విదేశీ మార్కెట్ల సంకేతాల కారణంగా రూపాయి బలహీనపడిందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముడిచమురు(Crude Oil) బ్యారెల్‌కు $ 111 స్థాయి కంటే ఎక్కువగా ఉండడం దీనికి కారణంగా చెబుతున్నారు. సోమవారం ఎఫ్‌ఐఐలు రూ.6,387.45 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దీనితో పాటు దేశీయ స్టాక్ మార్కెట్ భారీ పతనం కారణంగా రూపాయి సెంటిమెంట్లు కూడా బలహీనపడ్డాయి. సోమవారం కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 76.29 వద్ద ముగిసింది.

డాలర్‌తో పోలిస్తే రూపాయి ఒత్తిడిలో ఉందని, ముడి చమురు ధరలు పెరగడం, బాండ్ ఈల్డ్‌లు పెరగడం, డాలర్‌లో బలహీనత రూపాయి బలహీనతకు ప్రధాన కారణమని రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ శ్రీరామ్ అయ్యర్ అన్నారు. అయితే బ్యాంకులు డాలర్లను విక్రయించడంతో రూపాయి నష్టం పరిమితమైంది. ప్రస్తుతం రూపాయిపై ఉక్రెయిన్ సంక్షోభం పెరుగుతుండడంతో ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీనితో పాటు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు, ద్రవ్యోల్బణం కూడా పెట్టుబడిదారుల్లో ఆందోళనను పెంచుతున్నాయి.

Read Also.. కేంద్రం సంచలన నిర్ణయం.. ఆ పథకం కింద చేసే పనులకి డైరెక్ట్‌గా చెల్లింపులు..!